తెలుగు మహాసభలకు భారీగా తరలండి
వచ్చేనెలలో హైదరాబాద్‌లో జరుగనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు న్యూజిలాండ్‌లోని తెలుగు భాషాభిమానులు భారీగా తరలివెళ్లాలని మహాసభల ఎన్నారై సమన్వయకర్త మహేశ్ బిగాల పిలుపునిచ్చారు. ఆక్లాండ్నగరంలోని ఫికిలింగ్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం తెలుగు భాషాభిమానులు మహాసభల సన్నాహక సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సభికులతో మహేశ్ బిగాల మాట్లాడారు. కరీంనగర్ జిల్లాలోని బొమ్మలమ్మ గుట్ట పై తీసిన లఘు చిత్రాన్ని, మహాసభలపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి న్యూజిలాండ్ అధ్యక్షురాలు అరుణజ్యోతి ముద్దం, నరేందర్‌రెడ్డి పట్లోళ్ల, విజయ్‌భాస్కర్‌రెడ్డి కొసన, నర్సింగరావు ఇనగం, అభిలాషరావు యాచమనేని, కిరణ్‌కుమార్ పోకల, మనబడి న్యూజిలాండ్ వ్యవస్థాపకుడు మురళీధర్‌రావు, నిర్వాహకురాలు సునితా విజయ్, కల్యాణ్‌రావు కాసుగంటి, సంగీతభారతి మ్యూజిక్ స్కూల్ డైరెక్టర్ మల్లెల గోవర్ధన్, తెలుగు సంఘం అధ్యక్షుడు ధర్మేందర్ అల్లే, న్యూజిలాండ్‌లోని సంఘాల సభ్యులు పాల్గొన్నారు.