ప్రపంచ తెలుగు మహాసభల్లో నేటి కార్యక్రమాలు - Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

ప్రపంచ తెలుగు మహాసభల్లో నేటి కార్యక్రమాలు

ప్రపంచ తెలుగు మహాసభల నాలుగో రోజు సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పలు సాహితీ కార్యక్రమాలతో పాటు సాసంస్కృతిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. తెలుగు మహాసభలకు సాహితీ ప్రియులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.

Default post image

ఎల్బీ స్టేడియం పాల్కురికి సోమన ప్రాంగణం, బమ్మెర పోతన వేదిక
-సాయంత్రం 5 గంటలకు సాహిత్య సభ-తెలంగాణ పాట జీవితం
-సాయంత్రం 6.30 నుంచి తెలుగువారి సాంస్కృతిక కదంబ కార్యక్రమం
-రాత్రి 7 నుంచి సినీ సంగీత విభావరి

తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం, శ్రీబిరుదురాజు రామరాజు ప్రాంగణం, సామల సదాశివ వేదిక
-ఉదయం 10 గంటల నుంచి తెలంగాణ విమర్శ- పరిశోధన
-మధ్యాహ్నం 3 గంటల నుంచి శతక, సంకీర్తన, గేయ సాహిత్యం
-సాయంత్రం 6 నుంచి కవి సమ్మేళనం

రవీంద్రభారతి సమావేశమందిరం, డాక్టర్ యశోదారెడ్డి ప్రాంగణం, బండారు అచ్చమాంబ వేదిక
-ఉదయం 10 గంటలకు పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో తెలుగు
-మధ్యాహ్నం 3 గంటలకు న్యాయ పరిపాలన రంగాల్లో తెలుగు

రవీంద్రభారతి-గుమ్మన్నగారి లక్ష్మినరసింహశర్మ ప్రాంగణం, డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి వేదిక
-ఉదయం 10 గంటలకు తెలంగాణ మహిళా సాహిత్యంపై సదస్సు

రవీంద్రభారతి- పైడి జయరాజు ప్రివ్యూ థియేటర్
-ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లఘుచిత్రాల ప్రదర్శన
ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం అలిశెట్టి ప్రభాకర్ ప్రాంగణం,వానమామలై వేదిక
-ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు వరుసగా బృహత్‌కవిసమ్మేళనాలు

తెలంగాణ సారస్వత పరిషత్, తిలక్ రోడ్, బొగ్గులకుంట, మరింగంటి సింగరాచార్యుల ప్రాంగణం, శతావధాని కోరుట్ల కృష్ణమాచార్య వేదిక
-శతావధానం: ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు

Source: https://www.ntnews.com/telangana-news/world-telugu-conference-schedule-on-december-18-1-1-551423.html