ప్రపంచానికి చాటిచెప్పేలా తెలుగు మహాసభలు - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

ప్రపంచానికి చాటిచెప్పేలా తెలుగు మహాసభలు

హైదరాబాద్‌లో వంద స్వాగత తోరణాలు, ఒక్కో తోరణానికి ఒక్కొక్కరి పేరు – హరీశ్‌.

Harish rao at siddipet meetingప్రపంచానికి చాటిచెప్పేలా తెలుగు మహాసభలను నిర్వహించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహాక సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హరీశ్‌ మాట్లాడుతూ తెలుగు భాష గొప్పదనం, తెలంగాణ యాస వైభవం, ఇక్కడి సాహిత్య పరిమళాలను వెదజల్లే అవకాశం ఈ ప్రాంత కళాకారులు, సాహిత్యకారులకు దక్కిందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో తెలంగాణ సాహిత్యంపై చిన్నచూపు ఉండేదని, ఇక్కడి కవులు, రచయితలకు తగిన గౌరవం దక్కలేదని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్‌ ఉపన్యాసాల్లో స్వచ్ఛమైన తెలంగాణ సాహిత్య పరిమళాలు ఉంటాయని, స్వయంగా ఆయన సాహిత్య అభిమాని కావడం వల్లే ప్రపంచ తెలుగు మహాసభలకు హైదరాబాద్‌ వేదికగా మారిందన్నారు. మహాసభల నేపథ్యంలో హైదరాబాద్‌ నలువైపులా వంద స్వాగత తోరణాలను అత్యద్భుతంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఒక్కో తోరణానికి ఒక్కో సాహితీవేత్త, కళాకారుడు, కవి, రచయితల పేరు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. మహాసభల్లో సిద్దిపేట జిల్లా పెద్దన్న పాత్ర పోషించనుందని తెలిపారు.

Source: http://www.andhrajyothy.com/artical?SID=500159