తెలుగు మహాసభల సన్నాహక సదస్సుకు కాలిఫోర్నియాలో అపూర్వ స్పందన
తెలుగు భాష, సాహితీ వైభవాన్ని ప్రపంచమంతా చాటేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలను ప్రవాసులు విజయవంతం చేయాలని మహాసభల ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బీగాల కోరారు. హైదరాబాద్ లో డిసెంబర్ 15 నుండి 19 వరకు నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సు శనివారం కాలిఫోర్నియా లో ని బే ఏరియా లో నిర్వహించారు.
విజయ్ చవ్వా, పూర్ణ బైరి లు సమన్వయకర్తలుగా నిర్వహించిన ఈ సన్నాహక సదస్సు కు మహాసభల ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బీగాల ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.ప్రపంచమంతా పర్యటిస్తూ ఈ మహాసభలకు తెలుగు వారిని, సాహితీ ప్రియులను, తెలుగు భాషాభిమానులకు ఆహ్వానిస్తున్నట్టు అయన చెప్పారు.
తెలుగు జాతి సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమం లో TCA, TRS USA,సిలికాన్ ఆంధ్ర, BATA, VTA ,TDF,TATA,TANA, ATA, San Ramon Friends,STA, తెలంగాణ జాగృతి HSS, DNF సంఘాల ప్రతినిధులు,తెలుగు రచయతలు, కళాకారులు పాల్గొన్నారు.
Source: http://www.dharuvu.com/2017/11/20/huge-response-to-telugu-meetings-in-caliporniya/