హాలుడి నుంచి అంజయ్య దాకా! | World Telugu Conference 2017, Telangana State

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

హాలుడి నుంచి అంజయ్య దాకా!

తెలుగు కవులు, రచయితల పేర్లతో రాజధానిలో 62 స్వాగత తోరణాలు. సాహిత్య ప్రక్రియల పర్యవేక్షణకు ఐదు సంఘాలు
తెలంగాణ జీవన సౌందర్యంపై రూ.2.5 కోట్లతో లఘుచిత్రం.

ప్రపంచ తెలుగు మహాసభలకు వేదికవనున్న భాగ్యనగరం.. పలువురు సుప్రసిద్ద కవులు, రచయితలను సందర్శకులకు స్పురణకు తేనుంది. రాజధాని నలువైపులా ఏర్పాటు చేసే 62 స్వాగత తోరణాలకు ప్రముఖ కవులు, రచయితల పేర్లను పెట్టాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. స్వాగత ద్వారాన్ని చూసినంతనే చక్రవర్తి హాలుడు మొదలుకొని గూడ అంజయ్య వరకు.. ఒక్కసారిగా మదిలో మెదలనున్నారు.

తోరణాలకు పెట్టే పేర్లు.. : హాలుడు, పంప మహాకవి, మల్లియ రేచన, విద్యానాథుడు, ప్రతాపరుద్రుడు, పాల్కురికి సోమన, బమ్మెర పోతన, గోన బుద్దారెడ్డి, కుప్పాంబిక, గౌరన, మారన, మడికి సింగన, కొరవి గోపరాజు, కామినేని మల్లారెడ్డి, సింహగిరి కృష్ణమాచార్యులు, సర్వజ్ఞసింగభూపాలుడు, చరిగొండ ధర్మన్న, ఏకామ్రనాథుడు, మరింగంటి సింగరాచార్యులు, అద్దంకి గంగాధర కవి, పొన్నగంటి తెలగన్న, సారంగు తమ్మయ, సరుభి మాధవరాయలు, ఎలకూచి బాలసరస్వతి, భక్త రామదాసు, శేషప్పకవి, వరకవి సిద్దప్ప, రాకమచర్ల వేంకటదాసు, దున్నఈద్దాసు, గడ్డం రామదాసు, సురవరం ప్రతాపరెడ్డి, వట్టికోట ఆళ్వారుస్వామి, రావిచెట్టు రంగారావు, కాళోజీ, ఒద్దిరాజు సోదరులు, బండారు అచ్చమాంబ, బూర్గుల రామకృష్ణారావు, పీవీ నర్సింహారావు, దాశరథి కృష్ణమాచార్య, నెల్లూరి కేశవ స్వామి, భాగ్యరెడ్డివర్మ, దాశరథి రంగాచార్య, సి.నారాయణరెడ్డి, బిరుదరాజు రామరాజు, పాకాల యశోదారెడ్డి, కవిత్రయం (నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ), శ్రీనాథుడు, అల్లసాని పెద్దన, వేమన, తిరుపతి వేంకటకవులు, అన్నమాచార్య, గురజాడ అప్పారావు, శ్రీశ్రీ, గుర్రం జాషువా, గంగుల శాయిరెడ్డి, పల్లా దుర్గయ్య, వానమామలై వరదాచార్యులు, అరిగె రామస్వామి, దైదవేములపల్లి దేవేందర్‌, అలిశెట్టి ప్రభాకర్‌, మల్కిభరాముడు, గూడ అంజయ్య.

Source: http://www.eenadu.net/news/news.aspx?item=main-news&no=9