ప్రపంచ తెలుగు మహాసభలకు తరలిరండి - World Telugu Conference 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

ప్రపంచ తెలుగు మహాసభలకు తరలిరండి

move to the world telugu conferences
ప్రపంచ తెలుగు మహాసభలకు డెన్మార్క్‌లోని తెలుగు భాషాభిమానులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లాలని ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల కోరారు. డెన్మార్క్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జయచందర్ గంట సమన్వయకర్తగా వ్యవహరించారు. డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదురోజులపాటు హైదరాబాద్‌లో జరిగే మహాసభల్లో విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు తమ అభిప్రాయాలను చెప్పాలని సూచించారు. ఔత్సాహికులు wtc.telengana.gov.in లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ డెన్మార్క్ అధ్యక్షుడు శ్యాంబాబు ఆకుల, తెలుగు సంఘం ఇండిస్క్ క్లబ్ ప్రతినిధులు రమేశ్, పవన్, నరేందర్, సురేశ్‌కట్ట, తెలంగాణ జాగృతి డెన్మార్క్ అధ్యక్షుడు సంతోష్, సినీ రీల్స్ అధినేత కరుణాకర్, ఇండియన్ స్టోర్స్ అధినేత హేమ తదితరులు పాల్గొన్నారు.
Source:https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/move-to-the-world-telugu-conferences-1-2-560886.html