సైకిల్‌పై తెలుగు మహాసభల ప్రచారం - World Telugu Conferences - 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

సైకిల్‌పై తెలుగు మహాసభల ప్రచారం

cycle pracharam
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలపై జిల్లాల్లో ప్రచారం చేయడానికి ఓ యువకుడు సైకిల్‌ యాత్రకు శ్రీకారం చుట్టాడు. జనగామ జిల్లా తరిగొప్పులకు చెందిన నాగరాజు 31 జిల్లాల్లో 2200 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి మహాసభల ఆవశ్యకతను ప్రజలకు వివరించనున్నారు. తెలుగు భాషపై ఎంతో మమకారం ఉన్న 20 ఏళ్ల నాగరాజు.. తెలుగు మహాసభల్లో భాగస్వామి అయ్యేందుకు ఈ యాత్రకు పూనుకున్నారు. ఈ యాత్రను తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి ఆదివారం తన కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు మహాసభల విశిష్టతను ప్రజలకు తెలియజేసేందుకు సైకిల్‌ యాత్ర దోహదం చేస్తుందని అన్నారు. నాగరాజు సైకిల్‌ వెంట ప్రచార సామగ్రి ఉంటుందని, నలుగురు యువకులు సహాయకంగా ఉంటారని తెలిపారు. కాగా ఈ నెల 15న తెలుగు మహాసభల వేదిక ఎల్బీ స్టేడియం వద్దకు చేరుకోగానే ఈ యాత్ర ముగుస్తుంది. నాగరాజు ప్రచారానికి తెలంగాణ సాహిత్య అకాడమీ రూ.లక్ష ఆర్థిక సహాయం ప్రకటించింది. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి వ్యక్తిగతంగా రూ.28 వేలు అందజేశారు. తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి రూ. 10 వేలు ప్రకటించారు.

Source: http://www.andhrajyothy.com/artical?SID=504685