కెనడాలో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సు - World Telugu Conference

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

కెనడాలో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సు

Preparatory-Meeting-at-Canada
టొరంటో, కెనడా లో నేడు జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సభ సాయంత్రం 7:౩౦ గంటలకు పల్లీ బ్యాంకేట్ హాలులో అనేక తెలుగు భాషా ప్రియుల మధ్య ఉత్సాహంగా జరిగింది. ముఖ్య అతిధిగా ఎన్నారై కన్వీనర్ శ్రీ మహేష్ బిగాల గారు తెలంగాణ ప్రభుత్వం తరుపున ఆహ్వానాన్ని అందించారు.

ముందుగా ముడుపు విజయలక్ష్మి గారు స్వాగతం పలుకగా సాయి కిరణ్, సాయి కృష్ణ తెలంగాణ రాష్ట్రీయ గీతం అందెశ్రీ రాసినది ప్రార్థనా గీతంగా పాడగా. ఆ సుస్వర సంగీతం చెవులకింపుగా చెవులురే వంటకం అన్నట్లు వహ్వా వచ్చావా అనిపించేటట్లు ఉండెను.

తెలుగు భాష పంచదార కన్నా, పాయసం కన్నా, చెరుకు రసం కన్నా, జున్ను కన్నా తీయని ఉందని విజయలక్ష్మి గారు అన్నారు.

శ్రీ మహేష్ బిగాల గారు తెలుగు భాషా వికాసానికి, భాషా పరిరక్షణకై పాలుపంచుకొమ్మని ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయవలిసింది గా కోరారు.

TCAGT డైరెక్టర్, ఎంట్రప్రీనర్ శ్రీ బెజవాడ సూర్య గారు తెలంగాణ ప్రభుత్వం చేబట్టిన సత్సంకల్పాన్ని ప్రశంసించారు.

మాతృ భాష పిల్లలకు ధైర్యాన్ని, ఆత్మ గౌరవాన్ని పెంపొదిస్తుందని ‘సత్యం మనబడి’ విద్యార్థుల ద్వారా స్పష్టం అవుతుంది అని గురునాథ్ దాసు అన్నారు. ఉర్దూ భాషను పాఠశాలల్లో రెండవ భాషగా విద్యార్థులు నేర్చుకునేటట్లు చేసిన కెసిఆర్ గారికి రుణపడి ఉంటామని టీడీఫ్ జాయింట్ సెక్రటరీ శ్రీ అర్షద్ గోవి గారు అన్నారు. ఈ సభ యువతకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అని తమవంతు కృషి చేస్తామని అన్నారు.

సభకు విచ్చేసిన ప్రముఖులు తెలంగాణ సాహితీవేత్త కవి వచన వాగ్గేయకారుడిగా తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన శ్రీ ముడుపుకుల శేఖర రావు గారిని శ్రీ మహేష్ బిగాల సాదరంగా ఆహ్వానించినారు. పసందైన పాటలతో, విందు భోజనంతో వందన సమర్పణతో సభ ముగిసింది.

Source: http://www.telugutimes.net/home/article/3/6930/world-telugu-conference-preparatory-meeting-in-canada