తల్లీ నిన్నుదలంచి - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తల్లీ నిన్నుదలంచి

telugu
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పాల్కురికి సోమన ప్రాంగణం (లాల్‌బహదూర్ స్టేడియం) బమ్మెర పోతన వేదికపై ప్రారంభం కానున్నాయి. జాతీయ గీతాలాపన ఆనంతరం సరస్వతీ ప్రార్థనాగీతంతో ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర గవర్నర్ చెన్నమ నేని విద్యాసాగర్‌రావు, ఉమ్మడి రాష్ట్ర గవర్న ర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ విశిష్ట అతిథులు గా హాజరవుతుతున్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రారంభోపన్యాసం చేయనున్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ అ ధ్యక్షుడు నందిని సిధారెడ్డి స్వాగతోపన్యా సం చేస్తుండగా ఉపరాష్ట్రపతి ప్రధానోపన్యాసం చేస్తారు. అనంతరం ఈ వేదికపై తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ అధ్యక్షతన జరిగే సాంస్కృ తిక సమావేశంలో రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా, మద్రాసు విశ్వవిద్యాల యం తెలుగు విభాగాధిపతి ఆచార్య సంపత్ కుమార్ గౌరవ అతిథిగా హాజరవుతున్నారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు సీతాకాంత్ మ హాపాత్ర, ప్రతిభారాయ్ (ఒరిస్సా)లను రాష్ట్ర ప్రభుత్వం సత్కరించనుంది. ఆ తర్వాత ప్ర ముఖ కూచిపూడి నృత్యకళాకారులు డాక్టర్ రాజారెడ్డి, రాధారెడ్డి దంపతులు ‘మన తెలం గాణ సంగీత నృత్య రూపకం’ ప్రదర్శన ద్వా రా తెలంగాణ వైభవాన్ని ప్రతిబింబిస్తారు. అనంతరం లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీ కి చెందిన రామాచారి బృందం ప్రదర్శించే పాటకచేరి, ఏడు గంటల నుంచి గంటన్నర పాటు ‘జయ జయోస్తు తెలంగాణ’ నృత్య రూపక ప్రదర్శన ఉంటుంది. ముఖ్యమంత్రి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ రచించిన ఈ నృత్య రూపకాన్ని కళాకృష్ణ బృందానికి చెందిన కళాకారులు ప్రదర్శించనున్నారు. తెలుగు మహాసభల సందర్భంగా పలు ప్రక్రియలకు సంబంధించిన సదస్సులకు మరో ఆరు వేదికలు ఉన్నప్పటికీ తొలి రోజు మాత్రం ప్రధాన వేదికపై ప్రారంభోత్సవంతోనే ముగుస్తుంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రతినిధులు, అతిథులు, ఆహ్వానితులతో పాటు మొత్తం సుమారు నలభై వేల మంది హాజరవుతారని భావిస్తున్న నిర్వాహకులు దానికి తగిన ఏర్పాట్లు చేశారు. మొత్తం 11 రకాల పాస్‌లను జారీ చేసిన నిర్వాహకులు వాటికి తగినట్లుగా ఏయే ప్రవేశద్వారాల గుండా ప్రధాన వేదికకు చేరుకోవాలో, తిరిగి ఏ ద్వారం గుండా బైటకు వెళ్ళాలో, వాహనాలను ఎక్కడ నిలపాలో ట్రాఫిక్ రూట్ మ్యాప్‌తో సహా ఏర్పాట్లు చేశారు. ప్రతినిధులకు కూడా ఈ సమాచారాన్ని కిట్‌లలో వివరించారు.
ప్రధాన వేదిక చేరుకోడానికి ఎనిమిది ద్వారాలను ఎంపిక చేసిన నిర్వాహకులు వీటికి పోతన, సోమన, సురవరం ప్రతాపరెడ్డి, సి.నా.రె., దాశరధి కృష్ణమాచార్య, శ్రీశ్రీ, జాషువా, భక్తరామదాసు పేర్లను పెట్టారు. ఎనిమిది వేల మంది ప్రతినిధులు, సుమారు పాతికవేల మంది సందర్శకులు హాజరవుతారని తెలిపారు. ప్రధాన వేదికపై జరిగే కార్యక్రమాలు దూరంగా ఉన్నవారికి కూడా కనిపించేందుకు వీలుగా ఇరవై డిజిటల్ స్క్రీన్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పేర్లను నమోదు చేసుకున్న నగరానికి చెందిన ప్రతినిధులకు రవీంద్రభారతిలో గురువారం ఉదయం కిట్ల పంపిణీ పూర్తయింది. ప్రతినిధులకు మాత్రం వారికి వసతి సౌకర్యం కల్పించిన హోటళ్ళలోనే అందజేసే ఏర్పాట్లు జరిగాయి. కిట్‌లు అందనివారు హెచ్‌ఎండీఏ కమిషనర్ కార్యాలయం (బుద్ధపూర్ణిమ భవనం)లో సంప్రదించి పొందవచ్చని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయం తెలిపింది. ప్రతినిధులకు సమాచార సహా యం కోసం వాలంటీర్లు విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లలో ప్లాకార్డులు పట్టుకుని నిల్చుంటారని, వారి సూచనల మేర కు వేదిక, హోటళ్ళకు చేరుకోవచ్చునని నిర్వాహకులు తెలిపారు.
వీవీఐపీలకు ప్రత్యేక ప్రవేశం
మహాసభల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేవారిని పది విభాగాలుగా విభజించిన నిర్వాహకులు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, విప్‌లు లాంటి వీవీఐపీ ప్రతినిధులకు ‘డి’ గేట్‌ను కేటాయించారు. పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ‘పద్మ’ అవార్డు గ్రహీతలు లాంటి వీఐపీలు కూడా ‘డి’ గేటు ద్వారానే ప్రవేశిస్తారు. సీనియర్ అధికారులు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, కళా కారులు, అవార్డుగ్రహీతలు ‘బి’ గేట్, సాధారణ సందర్శకులు ఎఫ్, జి గేట్‌ల ద్వారా ప్రవేశించే విధంగా సూచనలు జారీ అయ్యాయి.
ఆరు వేదికలపై వంద సదస్సులు
ఐదు రోజుల పాటు జరిగే ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆరు వేదికలపై వందకు పైగా సదస్సులను నిర్వహించే విధంగా కార్యక్రమం రూపుదిద్దుకుంది. భాష, చరిత్ర, కవిత్వం, వచనం, పద్యం, కథ, నవల, సాహిత్యం, అవధానం, విమర్శ, పరిశోధన, సంకీర్తన, గేయం, కవి సమ్మేళనం.. ఇలా వివిధ ప్రక్రియల్లో వంద సదస్సులు జరగనున్నాయి. పై అంశాలతో పాటు ప్రతినిధులకు తెలంగాణ కళా సంపద, సంప్రదాయాలను తెలియజేసే విధంగా ఆయా ప్రాంతాల్లోని హస్తకళా ఖండాల ప్రదర్శన కూడా ఉంటుంది. తెలంగాణ ప్రాశస్తాన్ని, ప్రభుత్వ ప్రగతి గురించి వివరించే ఛాయాచిత్ర ప్రదర్శన చిత్రమయి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటైంది. రవీంధ్రభారతిలో ఛాయాచిత్ర, కార్టూన్ ప్రదర్శనతో పాటు ప్రివ్యూ థియేటర్‌లో ఐదు రోజుల పాటు ఉదయం మొదలు రాత్రి వరకు తెలంగాణ చరిత్రకు సంబంధించిన లఘు చిత్రాల ప్రదర్శన ఉంటుంది.