ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రత్యేక వెబ్‌సైట్‌ - World Telugu Conference

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రత్యేక వెబ్‌సైట్‌

website-for-world-telugu-conference
రాజధాని హైదరాబాద్‌లో వచ్చే నెల 15 నుంచి 19 వరకు జరిగే ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం WTC.TELANGANA.GOV.IN చిరునామాతో ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ నందినీ సిధారెడ్డి తెలిపారు. దీని ద్వారా దేశ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ తగిన సమాచారాన్ని పొందవచ్చన్నారు. మహాసభల్లో పాల్గొనే వారు ఈ వెబ్‌సైట్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో వ్యక్తిగతంగానూ పేర్లను నమోదు చేసుకోవచ్చని చెప్పారు. మరింత సమాచారం కోసం 040-29703142 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు.

దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు..

ప్రపంచ తెలుగు మహాసభలకు వచ్చే దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని నందిని సిధారెడ్డి తెలిపారు. ‘పీపుల్‌ విత్‌ హియరింగ్‌ ఇంపేయిర్డ్‌ నెట్‌వర్క్‌ (ఫిన్‌) సంస్థ వార్షికోత్సవం, బాలల దినోత్సవాన్ని మంగళవారం రవీంద్రభారతి సమావేశ మందిరంలో నిర్వహించారు. బధిరులైన బాలబాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక అంశాలు ఆద్యంతం ఆలోచింపజేశాయి. దివ్యాంగుల హక్కుల ఉద్యమ నేత మురళీకృష్ణ, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కె.వాసుదేవరెడ్డి, సంస్థ అధ్యక్షురాలు వి.ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

Source: http://www.eenadu.net/news/news.aspx?item=state-news&no=5