తెలంగాణ ఔన్నత్యాన్ని చాటాలి - World Telugu Conferences

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తెలంగాణ ఔన్నత్యాన్ని చాటాలి

naini-narasimha-reddy

తెలుగు మహాసభల ద్వారా తెలంగాణ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఖైరతాబాద్‌లోని శాఖా గ్రంథాలయం ఆవరణలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సభలో ఆయనతోపాటు బేవరేజస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అయాచితం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి నాయిని మాట్లాడుతూ.. ఈ నెల 16 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో జరుగనున్న ప్రపంచ తెలుగు మహాసభల విజయవంతానికి కృషి చేయాలన్నారు. తెలుగు ప్రజల గౌరవాన్ని పెంచేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. తెలంగాణ వారికి తెలుగు రాదన్న భావనను చెరిపి వేయాలని, తెలుగు భాష అంటే అది తెలంగాణేనని చాటిచెప్పాలన్నారు. కొందరు గిట్టనివారు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు, ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. కొలువుల కొట్లాట అంటున్నారని, కానీ వారి కొట్లాట పదవుల కోసమేనని ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నారని, ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలే హైకమాండ్ అని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో హైదరాబాద్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్నరామ్మూర్తి, కార్పొరేటర్లు పీ విజయారెడ్డి, మన్నె కవితారెడ్డి, మమతాగుప్తా, జగన్ తదితరులు పాల్గొన్నారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/the-people-of-the-trs-government-are-high-command-1-2-561799.html