సాహితీ ఉద్యమం తెలంగాణకే సొంతం - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

సాహితీ ఉద్యమం తెలంగాణకే సొంతం

ప్రపంచంలో అనేక ఉద్యమాలు జరిగినా సాంస్కృతిక, భాషా ఉద్యమం మాత్రం తెలంగాణకే సొంతమైందని ప్రజాకవి గోరటి వెంకన్న తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో భాషా, యాస పరిరక్షణ కీలకమైందని గుర్తుచేశారు. ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకొని సోమవారం వరంగల్‌రూరల్ జిల్లా యంత్రాంగం నిర్వహించిన సన్నాహక సభలో పాల్గొన్నారు. తెలంగాణ పల్లెల్లో అనేక మాండలికాలు దాగి ఉన్నాయని చెప్పారు. అంతరించి పోతున్న తెలంగాణ యాసను కాపాడటానికి సీఎం కేసీఆర్ తీసుకున్న చొరవ గొప్పదని కొనియాడారు. ప్రసంగంలో భాగంగా ఊపిరిపీల్చుకోకుండా వెంకన్న ఆలపించిన గేయాలకు సభికులు పరవశించి పోయారు. కార్యక్రమంలో ప్రముఖ కవి అంపశయ్య నవీన్, బన్న అయిలయ్య, వరదాచార్యులు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు పాల్గొన్నారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/the-literary-movement-is-owned-by-telangana-1-2-561868.html