తెలుగు మహాసభలను జయప్రదం చేద్దాం: నందిని సిధారెడ్డి

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తెలుగు మహాసభలను జయప్రదం చేద్దాం: నందిని సిధారెడ్డి

telugu-sabhalu
ఏ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో..అంతకంటే ఉత్సాహంగా ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతం చేయడానికి తెలుగు పండితులు కృషి చేయాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి కోరారు. హైదరాబాద్ లో వచ్చే నెల నిర్వహించనున్న తెలుగు మహాసభల సన్నాహకాల్లో భాగంగా రవీంద్రభారతిలోని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలో భాషా పండితులతో నందిని సిధారెడ్డి సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో తెలుగు భాష గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా తెలుగు మహాసభలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తామని చెప్పినప్పుడు తెలంగాణ మహాసభలు అంటే బాగుండేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారని ఆయన గుర్తుచేశారు. కానీ, తెలుగు మనది.. తెలంగాణలో అది వికసించిందని తెలపడానికే ఈ ప్రయత్నమని తెలిపారు.

ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనే ప్రతినిధులకు రిజిస్ట్రేషన్ చార్జీలను నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రం వారికి 100 రూపాయలు, ఇతర రాష్ట్రాల వారికి 500, ఇతర దేశాల వారికి 1000 రూపాయలుగా ఖరారు చేశారు. ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వసతులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్ కొరకు www.wtc.telangana.gov.in లో లాగిన్ కావాలని సూచించారు. ఈ సమావేశంలో సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, పలువురు తెలుగు పండితులు పాల్గొన్నారు.

Source: https://www.ntnews.com/telangana-news/nadini-sidhareddy-meeting-on-world-telugu-conference-1-1-548876.html