తెలుగు సభల సంరంభం | World Telugu Conference 2017, Telangana State

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తెలుగు సభల సంరంభం

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి ఘనంగా నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. తెలుగు మాగాణంలో అడుగుపెట్టే దేశ, విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు హైదరాబాద్‌ను సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. తెలంగాణ శిల్పకళావైభవాన్ని చాటేలా స్వాగతద్వారాలను నెలకొల్పనున్నారు. మహాసభల విజయవంతానికి మరో ఆరు కమిటీలు ఏర్పాటుచేశారు. సదస్సు చివరి రెండ్రోజులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, ఆహార్యం తలపించేలా ప్రత్యేకంగా లేజర్‌షోను నిర్వహించనున్నారు. తెలుగు మహాసభల్లో పాల్గొనే తెలుగు ఉపాధ్యాయులకు టీఏ, డీఏలు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇదిలావుంటే.. ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా దాదాపు 300మంది పద్యకవులతో కవిసమ్మేళనం, 600 మంది కవులతో వచనకవితా సమ్మేళనం నిర్వహించనున్నారు.

మహనీయుల పేరిట స్వాగత తోరణాలు
తెలుగు సాహిత్యంపై వెలుగురేఖలు ప్రసరింపజేసిన మహనీయల పేరుతో స్వాగత తోరణాలను ఏర్పాటుచేస్తున్నారు. ఇందుకోసం నగరంలోని 90 ప్రాంతాలను గుర్తించారు. ప్రతి స్వాగత తోరణంపైనా ఒక్కో సాహితీవేత్త లేదా కవి పేరు, ఆయన ఫొటో ఉంటాయి. స్వాగత తోరణాలను రూపొందించేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు ఏజెన్సీలను ఎంపికచేశారు. ఈ నెల 13వ తేదీ నాటికి ఎంపికచేసిన ప్రాంతాలలో స్వాగత తోరణాలు కొలువుదీరనున్నాయి. హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, ఎస్‌ఈ పరంజ్యోతి పర్యవేక్షణలో ఇంజినీర్లు బీ మోహన్, ఏఎం యూసుఫ్ హుస్సేన్, జీ దయాకర్‌రెడ్డి, ఎం చంద్రశేఖర్, జే కృష్ణారావు వీటి బాధ్యతలు చూస్తున్నారు.

స్వాగత తోరణాలు నెలకొల్పేది ఇక్కడే..
నగరాన్ని ఆనుకుని ఉన్న జాతీయ రహదారులతోపాటు గ్రేటర్ హైదరాబాద్‌వ్యాప్తంగా స్వాగత తోరణాలను ఏర్పాటుచేస్తున్నారు. ఇందుకోసం 90 ప్రాంతాలను ఎంపికచేశారు. సాగర్ రింగ్‌రోడ్, హయత్‌నగర్ బస్‌స్టాప్, ఎల్బీనగర్, ఆరాంఘర్ నుంచి బహదూర్‌పుర, శంషాబాద్ (కేఎల్‌సీసీ ఎదురుగా), వనస్థలిపురం, టీవీ టవర్, సైదాబాద్, ఒవైసీ దవాఖాన (చాంద్రాయణగుట్ట), ఎంజీబీఎస్ బస్‌స్టాప్, మీరాలం, సాగర్ సొసైటీ బంజారాహిల్స్ రోడ్ నం.2, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, అయ్యప్ప సొసైటీ, హైటెక్‌సిటీ (హైటెక్స్), కొండాపూర్ క్రాస్‌రోడ్స్, ఆల్విన్ క్రాస్ రోడ్స్, మియాపూర్, కూకట్‌పల్లి మెట్రో, కుత్బుల్లాపూర్, చింతల్, జీడిమెట్ల క్రాస్‌రోడ్స్ (సుచిత్ర వద్ద), కొంపల్లి ైఫ్లెఓవర్, మౌలాలి, మల్కాజిగిరి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రవేశద్వారం, చిలుకలగూడ, తిరుమలగిరి, నేరేడ్‌మెట్ క్రాస్‌రోడ్స్, ఏఎస్‌రావు నగర్, ఎన్‌జీఆర్‌ఐ, రైల్ నిలయం, సికింద్రాబాద్ స్టేషన్, జూబ్లీ బస్‌స్టేషన్, లిబర్టీ అంబేద్కర్ విగ్రహం, బషీర్‌బాగ్ ైఫ్లెఓవర్, శంకర్‌మఠ్, కాచిగూడ స్టేషన్, ఎల్బీ స్టేడియం ప్రవేశద్వారం, లలిత కళాతోరణం ప్రవేశద్వారం, పబ్లిక్‌గార్డెన్స్, కోఠి, హైదర్‌గూడ క్రాస్‌రోడ్స్, హిమాయత్‌నగర్ క్రాస్‌రోడ్స్, రాజ్‌భవన్ రోడ్, నెక్లెస్‌రోడ్ స్టేషన్, ఉప్పల్ చెరువుకుంట, ఉప్పల్ ఎంట్రీ పాయింట్, లాలాగూడ బ్రిడ్జి, తార్నాక, ఆర్పీ రోడ్, కట్టమైసమ్మ, తూంకుంట, శామీర్‌పేట ఓఆర్‌ఆర్ రోడ్, అల్వాల్ క్రాస్‌రోడ్స్, బోయిన్‌పల్లి కమాన్, కేబీఆర్ పార్కు, తెలంగాణ భవన్, లంగర్‌హౌజ్, పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే, ఎన్టీఆర్ మార్గ్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్-బేగంపేట, ఎంజే కాలేజీ-బంజారాహిల్స్, ప్యాట్నీ సెంటర్, నాంపల్లి రైల్వేస్టేషన్, సీఎం క్యాంపు కార్యాలయం వద్ద స్వాగత తోరణాలను ఏర్పాటు చేస్తున్నారు.

13వతేదీ నాటికి సర్వం సిద్ధం: టీ చిరంజీవులు, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, హెచ్‌ఎండీఏ కమిషనర్
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ఏర్పాట్లను ఈ నెల 13వ తేదీకల్లా పూర్తిచేస్తాం. ఎంపిక చేసిన 90 ప్రాంతాల్లో స్వాగత తోరణాలను ఏర్పాటుచేస్తాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫైర్‌వర్క్స్, లేజర్ షో నిర్వహిస్తాం.

300 మంది పద్యకవులతో కవిసమ్మేళనం
ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించడంలో భాగంగా దాదాపు 300మంది పద్యకవులతో కవిసమ్మేళనం నిర్వహించనున్నారు. బుధవారం నాటికి 300 పేర్లు నమోదుచేసుకున్నారు. 600 మంది కవులతో వచనకవితా సమ్మేళనం నిర్వహించనున్నారు. రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ ఏర్పరిచిన కమిటీలు బుధవారం వరుస సమావేశాలను నిర్వహించాయి. పద్యకవులు పెద్ద సంఖ్యలో తమ పేర్లు నమోదు చేసుకోవడంతో నిర్వాహకులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. పేర్లు నమోదు చేసుకున్న అందరికీ అవకాశం కల్పించాలని నిర్ణయించారు. పద్యం విశిష్టతను చాటి చెప్పేలా పద్యకవుల కవిసమ్మేళనం ఏర్పాటుచేస్తున్నారు. ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పించడంతో భాషా పండితులు తమ ప్రతిభను కనబరిచేందుకు ముందుకు వస్తున్నారు. కవుల సంఖ్యను పరిమితం చేయకుండా అందరినీ ఆదరించాలని, అవకాశాలు ఇవ్వాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మహాసభలో పాల్గొనే తెలుగు టీచర్లకు టీఏ, డీఏ
ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరయ్యే తెలుగు ఉపాధ్యాయులకు టీఏ, డీఏ సదుపాయాన్ని విద్యాశాఖ కల్పించింది. ఈ మేరకు చర్యలను తీసుకోవాలని కోరుతూ జిల్లా విద్యాధికారులకు విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు.

కార్టూన్ల ప్రదర్శన
ప్రపంచ తెలుగు మహాసభల్లో కార్టూన్ల ప్రదర్శన నిర్వహించనున్నట్టు సాహిత్య అకాడమీ అధ్యక్షులు నందిని సిధారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు భాష, తెలంగాణ భౌగోళికత, సాంస్కృతిక వైభవం, పండుగలు, సామెతల ఆధారంగా ఉండే కార్టూన్లను ప్రదర్శనకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న కార్టూనిస్టులు ఏ-3 సైజులో కార్టూన్లు వేసి పంపించాలి. వ్యాఖ్య తెలుగులోనే ఉండాలి. కార్టూన్‌తోపాటు కార్టూనిస్ట్ పేరు, చిరునామా, ఫోన్ నంబరు, కార్టూన్ తన స్వంతమనే హామీపత్రం జతచేయాలి. ఈ ప్రదర్శన నిర్వాహకులుగా కార్టూనిస్టులు మృత్యుంజయ్, శంకర్, నర్సిం వ్యవహరిస్తారు. కార్టూన్లను డిసెంబర్ 10లోగా wtmscartoon@gmail.com కు మెయిల్ చేయాలి. ప్రదర్శనలో పాల్గొన్నవారికి సర్టిఫికెట్, నగదు బహుమతి అందిస్తారు. ప్రదర్శించిన కార్టూన్లను పుస్తకం రూపంలో తీసుకువస్తారు.

మహాసభలకు మరికొన్ని కమిటీల ఏర్పాటు
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా బుధవారం మరికొన్ని కమిటీలను ఏర్పాటుచేశారు. భాషా సదస్సుల కమిటీ, గేయతత్వ, అవధాన, మహిళా సాహిత్య, బాలసాహిత్య, చరిత్ర కమిటీలను ఏర్పాటుచేసినట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు.

మహిళా సాహిత్య కమిటీ
పోల్కంపల్లి శాంతాదేవి, ఆచార్య సూర్య ధనుంజయ్, జూపాక సుభద్ర, అనిశెట్టి రజిత, ఆచార్య వేలూరి శ్రీదేవి, ఆచార్య కడిమిళ్ల లావణ్య, ఆచార్య త్రివేణి, షాజహానా, జ్వలిత, చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ, బండారు సుజాతాశేఖర్, నెల్లుట్ల రమాదేవి, కొండపల్లి నీహారిణి.

బాలసాహిత్య కమిటీ
ఎం చిత్తరంజన్, ఐతా చంద్రయ్య, వేదాంతం సూరి, వాసాల నర్సయ్య, పత్తిపాక మోహన్, వేదకుమార్, దాసరి వెంకటరమణ, వీఆర్ శర్మ.

భాషా సదస్సుల కమిటీ
ఆచార్య రవ్వా శ్రీహరి, కపిలవాయి లింగమూర్తి, కే రామచంద్రమూర్తి, అల్లం నారాయణ, కే శ్రీనివాస్, కట్టా శేఖర్‌రెడ్డి, వర్దెల్లి మురళి, డాక్టర్ నలిమెల భాస్కర్, డాక్టర్ మలయశ్రీ. డాక్టర్ వెలిచాల కొండల్‌రావు.

చరిత్ర కమిటీ
ఘంటా చక్రపాణి, డాక్టర్ డీ రాజిరెడ్డి, ద్యావనపల్లి సత్యనారాయణ, హరగోపాల్, కుర్రా జితేంద్రబాబు, కావూరి శ్రీనివాస్, మల్లేపల్లి లక్ష్మయ్య.

గేయతత్వ కీర్తనల కమిటీ
తిరుమల శ్రీనివాసాచార్య, పీ భాస్కరయోగి, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్‌తేజ, చంద్రబోస్, కందికొండ యాదగిరి, చెన్నకేశవరెడ్డి, వడ్డేపల్లి కృష్ణ, వారిజారాణి, శ్రేష్ఠ.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/hyderabad-is-ready-for-world-telugu-mahasabhalu-1-2-561489.html