ప్రభుత్వ కార్యాలయాలకు తెలుగు బోర్డులు - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

ప్రభుత్వ కార్యాలయాలకు తెలుగు బోర్డులు

మేడ్చల్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల సూచిక బోర్డులన్నీ తెలుగులోనే ఉండాలని కలెక్టర్ ఎంవీ రెడ్డి స్పష్టంచేశారు. తెలుగు భాష సంరక్షణ, ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ఇతర కార్యాలయ బోర్డులను యుద్ధ ప్రాతిపదికన తెలుగులో ఏర్పాటుచేయాలన్నారు. మేడ్చల్ జిల్లా ఏర్పడి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ కొన్ని కార్యాలయాల్లో రంగారెడ్డి జిల్లా అని ఉండడం సబబు కాదన్నారు. జిల్లాకు చెందిన సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. కవులను, సాహితీ ప్రియులను పంపించేలా జిల్లా విద్యాధికారి చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాస్థాయి సన్నాహాక ఉత్సవాల్లో హాజరుకాని అధికారుల వివరాలు అందించాలన్నారు. మేడ్చల్ మండలం గిర్మాపూర్‌లో నిర్మించిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను డిప్యూటీ సీఎం త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉన్నదని, కళాశాలకు రోడ్డు సౌకర్యం, ప్రహరీ ఏర్పాటు చేయాలన్నారు. మిషన్ భగీరథ కింద రక్షితతాగునీటిని అందించాలని, ల్యాబ్ సౌకర్యం కల్పించాలని సూచించారు. హరితహారంలో వచ్చే ఏడాది నాటనున్న మొక్క ల వివరాలు ఇవ్వాలని, అనుగుణంగా నర్సరీ ప్రణాళిక తయారు చేయాలన్నారు. సమావేశంలో జేసీ ధర్మారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

MvReddy

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/telugu-boards-for-government-offices-1-2-561884.html