తెలంగాణ పద్య సౌరభం - World Telugu Conference 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తెలంగాణ పద్య సౌరభం

Default post image

తెలుగు సాహిత్యంలో పేరొందిన తెలంగాణ కవులు రచించిన 80 పద్యాలతో ‘తెలంగాణ పద్య సౌరభం’ సీడీని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి, కవి గాయకుడు దేశపతి శ్రీనివాస్‌ రూపొందిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు రామాచారి దర్శకత్వంలో దేశపతి ఈ పద్యాలను పఠించి, వాటి తాత్పర్యాలను వివరించనున్నారు.ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవం రోజు ప్రముఖుల చేతుల మీదుగా ఈ సీడీని ఆవిష్కరించనున్నారు. జినవల్లభుడు, వేములవాడ భీమకవి, పోతన, సోమన, కుప్పాంబిక, గోన బుద్ధారెడ్డి, గౌరన, మారన, కురవి గోకరాజు, అద్దంకి గంగాధరుడు, పిల్లలమర్రి చినవీరభద్రుడు, కందుకూరి రుద్రకవితోపాటు ఆధునిక కవులైన దాశరథి, పల్లా దుర్గయ్య, గంగుల సాయిరెడ్డి, వానమామలై వరదాచార్యులు, జగన్నాథాచార్యులు, దూడెం నాంపల్లి, మామిండ్ల రామాగౌడ్‌, వేముగంటి నర్సింహాచార్యులు వంటి వారు రచించినవి ఇందులో ఉంటాయి.
పద్యానికి గౌరవం
తెలంగాణ కవుల కలాల నుంచి జాలువారిన పద్యాలు భాషకు గొప్ప గౌరవాన్ని తెచ్చాయి. పద్యాలు, వాటి భావాలు, అర్థాలతో మన భాష సుసంపన్నమవుతోంది. పద్యాలవిశిష్టతను ఆధునిక తరానికి తెలియజెప్పడానికే ఈ సంకల్పానికి పూనుకున్నాం. మేం రూపొందించే ‘తెలంగాణ పద్య సౌరభం’ సీడీ తరతరాలకు తరగని ఆస్తిలా ఉంటుంది.

Source: http://www.eenadu.net/news/news.aspx?item=ts-state-news&no=4