కిట్ల పంపిణీ ప్రారంభం - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

కిట్ల పంపిణీ ప్రారంభం

ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రతినిధులుగా పేర్లు నమోదు చేసుకున్న దాదాపు 8వేల మందికి ప్రత్యేక కిట్ల పంపిణీ రవీంద్రభారతిలో గురువారం ప్రారంభమైంది. చేనేత సంచిలో వివిధ వస్తువులను ఉంచి అందజేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోనివారు గురువారం రవీంద్రభారతికి వచ్చి తీసుకున్నారు. వీటిలో మధ్యాహ్న భోజనం చేయడానికి కూపన్లు, పోతన భాగవతంపై సి.నారాయణరెడ్డి రచించిన ‘మందార మకరందాలు’ పుస్తకం లేదు. దీనిపై సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ కిట్‌లో ఇచ్చిన ప్రతినిధి గుర్తింపుకార్డు ఉంటే వేదికల వద్ద మధ్యాహ్నం భోజనం చేయవచ్చని, అందుకే ప్రత్యేకంగా కూపన్లు ఇవ్వలేదన్నారు. మందార మకరందాలు పుస్తకం ఇవ్వాలని చివరలో అనుకున్నందున ముద్రణ పూర్తవలేదని, శుక్రవారం నుంచి అందజేస్తామని చెప్పారు. మహాసభల్లో పాల్గొన్kits-startనట్లు పేరు రాయకుండా ఖాళీ వదిలిపెట్టిన ధ్రువపత్రాన్ని కూడా కిట్‌లో ఉంచారు. ప్రతినిధి కార్డుపై పేరుంటే బాగుండేదని కిట్లు తీసుకున్నవారు అభిప్రాయపడ్డారు.
కిట్‌లో ఏమున్నాయంటే..
1. తెలంగాణ వైభవం- పరిచయ దీపిక (పుస్తకం)
2. మన తెలుగు (జేబులో ఇమిడే పుస్తకం)
3. వాగ్భూషణం భూషణం (ప్రసంగాలు చేయడంపై ఇరివెంటి కృష్ణమూర్తి రాసిన ఈ పుస్తకంతో కేసీఆర్‌ స్ఫూర్తిపొందారు)
4. మహాసభల్లో పాల్గొన్నట్లు ధ్రువపత్రం
5. ప్రతినిధి గుర్తింపు కార్డు
6. కలం, రాతపుస్తకం
7. మహాసభల కార్యక్రమాల వివరాలతో కరదీపిక
8. మహాసభల మార్గదర్శి (రూట్‌ మ్యాప్‌)