పేర్లు నమోదు చేసుకున్న వారికి ప్రత్యేక గ్యాలరీ | World Telugu Conference 2017, Telangana State

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

పేర్లు నమోదు చేసుకున్న వారికి ప్రత్యేక గ్యాలరీ

ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకున్నవారికి సభా ప్రాంగణాల వద్ద ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు. నగరంలోని ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభల మంత్రివర్గ ఉపసంఘం భేటీయైంది. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు అధికారులతో సమీక్ష సమావేశం జరిపారు. ఈ సందర్భంగా మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ.. తెలుగు మహాసభలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. మహాసభల నిర్వహణకు రూ. 50 కోట్లు కేటాయించామన్నారు. తెలంగాణ సంస్కృతిని చాటేలా ప్రత్యేక డాక్యుమెంటరీ రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడించారు.

నందిని సిధారెడ్డి స్పందిస్తూ.. మహాసభల్లో పాల్గొనేందుకు ఆఫ్‌లైన్ ద్వారా 4,293 మంది, ఆన్‌లైన్ ద్వారా 2.611 మంది పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. పేర్లు నమోదు చేసుకున్నవారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేస్తామన్నారు. అదేవిధంగా పేర్లు నమోదు చేసుకున్న వారికి ప్రాంగణాల వద్ద ప్రత్యేక గాలరీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మహాసభల్లో పాల్గొంటున్న వారికి మధ్యాహ్నం భోజనం, రవాణా సదుపాయం ఉచితంగా కల్పించనున్నట్లు చెప్పారు. బస చేసేందుకు హోటళ్లలో రాయితీ సదుపాయం కల్పిస్తామని పేర్కొన్నారు.

Source: https://www.ntnews.com/telangana-news/special-gallery-for-registered-users-in-world-telugu-conference-1-1-550175.html