మహాసభల్లో మనమూ పాల్గొందాం - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

మహాసభల్లో మనమూ పాల్గొందాం

ప్రపంచ తెలుగు మహాసభల్లో సామాన్య సాహిత్యాభిమానులు ప్రతినిధులుగా పాల్గొనేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. డిసెంబర్ 15 నుంచి ఐదురోజుల పాటు జరిగే ఈ సభల్లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌ద్వారా నామమాత్రపు రుసుము చెల్లించి పేర్లు నమోదు చేసుకోవచ్చు. కవు లు.. కళాకారులు, సాహిత్యాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నది. ప్రభుత్వం రూపొందించిన డబ్ల్యూటీసీ. తెలంగాణ.గవర్నమెంట్.ఇన్ అనే వెబ్‌సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు ఆన్‌లైన్‌లో రూ.100, ఇతర రాష్ర్టాల ప్రతినిధులు రూ.500 రుసుం చెల్లించాలి. వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సిన సమాచారమంతా తెలుగులోనే ఉంటుంది. మహాసభల్లో పాల్గొనే భాషాపండితులకు ఆన్‌డ్యూటీ సౌకర్యం కూడా కల్పించారు.
Default post image
అతిథులకు స్టార్ హోటళ్లలో వసతి
ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనే అతిథులందరికీ స్టార్ హోటళ్లలో తెలంగాణ ప్రభుత్వం వసతి కల్పిస్తుందని సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి తెలిపారు. మహాసభలకు వచ్చే అతిథులకు వసతులు కల్పించేందుకు సోమవారం నగరంలోని స్టార్ హోటళ్ల ప్రతినిధులతో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంతో కలిసి చర్చించారు. సాహిత్య అకాడమీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో హోటళ్లలో వసతులు, భోజనాలు, చార్జీల గురించి సంప్రదింపులు జరిపారు. ప్రభుత్వ ప్రతినిధులు ఆయా హోటళ్లను పరిశీలించి, తగిన సౌకర్యాలు ఉన్నాయని ధ్రువీకరిస్తేనే అతిథుల కోసం గదులు తీసుకుంటామని వెంకటేశం స్పష్టం చేశారు. ఆయా హోటళ్లలో ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచుతామని చెప్పారు. హోటళ్లలో తెలంగాణ సంప్రదాయం ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలని హోటళ్ల యాజమాన్యాలను ఆయన కోరారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/representatives-apply-registration-in-telugu-1-2-561279.html