తెలుగు మహాసభల ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి
ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా రానున్నారు. సీఎం కేసీఆర్ వినతిని రాష్ట్రపతి అంగీకరించారు. డిసెంబర్ 15 నుంచి 19 వరకు తెలుగు మహాసభలు కొనసాగనున్నాయి. తెలుగు మహాసభల సన్నాహక సమావేశాలకు అపూర్వ స్పందన లభిస్తుంది. తెలుగు మహాసభల ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి.
Source: https://www.ntnews.com/telangana-news/president-ramnath-kovind-will-attend-to-telugu-mahasabhalu-1-1-549091.html