బేగంపేటలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు ఘన స్వాగతం
బేగంపేట ఎయిర్‌పోర్టులో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతికి గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎంలు మహముద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి.. సైనిక గౌరవ వందనం స్వీకరించారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాలకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చిన రామ్‌నాథ్ కోవింద్.. బేగంపేట ఎయిర్‌పోర్టులో మధ్యాహ్నం 3.30 గంటలకు దిగారు.
బేగంపేట విమానాశ్రయం నుంచి సాయంత్రం 4.05 గంటలకు రాజ్‌భవన్‌కు వస్తారు. సాయంత్రం 6 గంటలకు రాజ్‌భవన్ నుంచి ఎల్బీ స్టేడియానికి చేరుకొని ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాల్లో పాల్గొంటారు. రాత్రి 7.15 గంటల వరకు ఎల్బీస్టేడియంలోనే ఉంటారు. తిరిగి 7.25 గంటలకు తిరిగి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు భోజనం చేసి, అక్కడే బస చేస్తారు.
బుధవారం ఉదయం 9.30 గంటల నుంచి 10 గంటల వరకు పలువురిని కలుస్తారు. ఉదయం 10 గంటలకు హుస్సేన్‌సాగర్‌లో ఉన్న బుద్ద విగ్రహం వద్దకు చేరుకొని నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి 11.15 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకొని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళుతారు. మధ్యాహ్నం 1.55 గంటలకు రాష్ట్రపతిభవన్‌కు చేరుకుంటారు.
Source: https://www.ntnews.com/telangana-news/president-ramnath-kovind-at-begumpet-airport-1-1-551589.html