ముగింపు ఉత్సవాలకు రాష్ట్రపతి - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

ముగింపు ఉత్సవాలకు రాష్ట్రపతి

RamnathKovindప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరుకానున్నారు. ఈ నెల 19వ తేదీన హైదరాబాద్‌కు వస్తున్న రాష్ట్రపతి తిరిగి 20న డిల్లీకి వెళతారు. ఈ మేరకు రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్రపతి రెండురోజుల పర్యటనకు హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో భద్రత, వసతి ఏర్పాట్ల కోసం మంగళవారం సచివాలయంలోని సీ బ్లాక్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ నేతృత్వంలో సమన్వయ సమావేశం జరుగనున్నది. ఈ మేరకు సంబంధితశాఖల అధికారులు హాజరుకావాలని సమాచారం పంపించారు. ఈ నెల 19న మధ్యాహ్నం 2.55 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు రాష్ట్రపతి వస్తారు. సాయంత్రం 5 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ప్రపంచ తెలుగుమహాసభల ముగింపు ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. 19వ తేదీ రాత్రి హైదరాబాద్‌లోనే బస చేస్తారు. 20వ తేదీ ఉదయం 10.30 గంటలకు హుస్సేన్‌సాగర్‌లో బుద్ధ విగ్రహానికి నివాళులర్పిస్తారు. ఆ తరువాత తిరిగి ఢిల్లీకి వెళతారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/today-coordination-meeting-in-cs-leadership-1-2-561874.html