ప్రతి సదస్సులో రాష్ట్ర మంత్రి - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

ప్రతి సదస్సులో రాష్ట్ర మంత్రి

Default post image

తెలుగు మహాసభల్లో వివిధ వేదికలపై జరిగే సదస్సులకు ముఖ్యఅతిథులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు, లోక్‌సభ సభ్యులు హాజరవుతారు. ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియంలో ఒక్కో రోజు ఒక్కో సదస్సు చొప్పున మూడు రోజులు నిర్వహిస్తారు. మిగిలిన అయిదు వేదికల్లోనూ సదస్సులు, సమ్మేళనాలు, అవధానాలుంటాయి. అధిక సదస్సులకు మంత్రులు హాజరవుతారు. మరికొన్నింట్లో ఎంపీలు, స్పీకర్‌, శాసనమండలి ఛైర్మన్‌, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొంటారు. ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహబూద్‌ అలీ రెండేసి సదస్సులకు ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఒక్కో సదస్సులో వక్తలు నలుగురి నుంచి ఆరుగురు ఉంటారు.వక్తలను శాలువా, జ్ఞాపికలు, ధ్రువపత్రం, రూ.మూడువేల నగదు అందజేసి ముఖ్యఅతిథులు సత్కరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతి సదస్సులో ఒకరు లేదా ఇద్దరిని సత్కరిస్తుంది. ప్రభుత్వం సత్కరిస్తున్న సుమారు 20 మందికి మాత్రం రూ.10 వేల చొప్పున నగదు బహుమతి, భూదాన్‌ పోచంపల్లిలో తయారు చేసిన ఇక్కత్‌ శాలువాలతో సన్మానిస్తారని తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ నందిని సిధారెడ్డి సృష్టంచేశారు.

Source: http://www.eenadu.net/news/news.aspx?item=ts-state-news&no=17