అచ్చతెనుగు ప్రాంగణాలు - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

అచ్చతెలుగు ప్రాంగణాలు

Telugu-MahaSabhalu1

ప్రపంచ తెలుగు మహాసభలకు అద్భుతమైన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎల్‌బి స్టేడియం ప్రధాన వేదికగా జరిగే ఈ ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. ప్రవేశద్వారం మొదలు, ప్రధాన వేదిక వరకు ప్రతి అలంకరణ తెలంగాణ రాష్ట్ర చరిత్ర, సంస్కృతి ఉట్టిపడేలా రూపొందించారు. ప్రతి సంగమేశ్వర ఆలయం మొదలు, బాసర వరకు అన్ని ప్రాంతాల చారిత్రాక విశిష్టత వివిధ అలంకరణలలో ప్రతిబింబించేటట్లు ఏర్పాటుచేశారు. సాయం సమయంలో ఎల్‌బి స్టేడియంలో మహాసభల గొప్పతనాన్ని సభికులకు తెలిసేలా రంగు, రంగుల లేజర్ లైట్ షో ఆకట్టుకుంటోంది. ప్రధాన వేదిక లోపల ఆసీనులయ్యే వారందరికీ తెలంగాణ సాహితీమూర్తుల గొప్పతనం తెలిపేలా వారి చిత్రపటాలు, వారి రచించిన పద్యాలు కుడి ఎడమ వైపు ప్రదర్శనకు ఉంచారు. మహాసభలకు హాజరయ్యే ప్రతినిధులందరికి ఘనంగా స్వాగతం పలికే తీరులో సంప్రదాయ ఆహ్వాన నమస్కారం ఆకృతి, దాశరథి రంగచార్య నా తెలంగాణ కోటి రత్నాల వీణ ఆకట్టుకునే తీరులో సిద్ధ మైంది.

ప్రధాన వేదికను ప్రత్యేకతలను గమనిస్తే.. సుమారు 170 అడుగులు వెడల్పుతో వెయ్యి స్తంభాలపై వేదిక ఉంది. కాకతీయ కళాతోరణంతో పైన తంగేడు పూల మధ్యలో నమస్కారంతో సభికులకు ప్రధాన వేదిక ఆహ్వానం పలుకుతోంది. ద్వారకపాలకులుగా పాల పిట్టలు ఎడమ వైపు, అటు తరువాత సంగమేశ్వర దేవాలయంపైన 7వ శతాబ్దానికి చెందిన అలంపూర్ నాగబంధం ఉంది. 56 తెలుగు అక్షరాల వర్ణమాల.. చీకట్లో వెలుగులు పంచే నక్షత్రాలు రూపంలో దర్శనమిస్తున్నాయి. ప్రధాన వేదిక కాకతీయ తోరణం కుడి, ఎడమలలో నాగిని నధనిక.. నాగిని మధనిక కుడివైపు శిల్పాలున్నాయి. తెలంగాణ సంస్కృతికి చిహ్నాంగా బతుకమ్మలు, జింకలు, సుమారు 20 అడుగుల ఎత్తులో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశారు. మొత్తం 51 మంది తెలంగాణ మహనీయుల చిత్రపటాలు అలంకరించడం వల్ల చూపరులకు ఆనందం కలిగిస్తున్నారు.

Source: http://manatelangana.news/2017/12/prapancha-telugu-maha-sabhalu-started-in-hyderabad/