ప్రపంచ తెలుగు మహాసభల షెడ్యూల్ - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

ప్రపంచ తెలుగు మహాసభల షెడ్యూల్

శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ప్రపంచ తెలుగు మహాసభల కరదీపికను రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేసింది. ఏయే తేదీలలోఏయే వేదికల మీద ఏయే కార్యక్రమాలు నిర్వహిస్తారో ఇందులో పేర్కొన్నారు. ఆ వివరాలివే.

World Telugu Conference

పాల్కురికి సోమనాథ ప్రాంగణం (ఎల్బీ స్టేడియం)బమ్మెర పోతన వేదిక
డిసెంబర్ 15: ప్రారంభ వేడుక సమయం: సాయంత్రం 5:00 గం.
సభాధ్యక్షత: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు
ముఖ్యఅతిథి: ఉప రాష్ట్రపతి డాక్టర్ వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు
సాయంత్రం 6:00: సాంస్కృతిక సమావేశం: సీతాకాంత్ మహాపాత్ర, ప్రతిభారాయ్‌కు సత్కారం
సా. 6:30: డాక్టర్ రాజారెడ్డి, రాధారెడ్డి కూచిపూడి కళాకారుల మన తెలంగాణ సంగీత నృత్య రూపకం
రా. 7.00 – 7:30: పాటకచేరి (లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీ బృందం)
రా. 7:30 – 9:00: జయ జయోస్తు తెలంగాణ (సంగీత నృత్య రూపకం)
డిసెంబర్ 16 కార్యక్రమాలు :
సా. 5 గం.: తెలంగాణలో తెలుగు భాష వికాసం సాహిత్యసభ
సా. 6:30: సాంస్కృతిక సమావేశం
రా. 7:00- 7:30: శతగళ సంకీర్తన (భక్తరామదాసు సంకీర్తనల ఆలాపన)
రా. 7:30 -7:45: కళాకారుడు మైమ్ మధు ముకాభినయం ప్రదర్శన
రా. 7:45-8:00: వింజమూరి రాగసుధ నృత్యం
రా. 8:00-8:15: షిర్నాకాంత్ బృంద కూచిపూడి నృత్యం
రా. 8:15 – 9:00: డాక్టర్ అలేఖ్య నృత్యం
డిసెంబర్ 17: సా. 5:00: మౌఖిక వాఙ్మయం భాష సాహిత్యసభ
సా. 6:30: సాంస్కృతిక సమావేశం
డిసెంబర్ 18: సా. 5:00: తెలంగాణ పాట-జీవితం సాహిత్య సభ
సా. 6:30: సాంస్కృతిక సమావేశం
డిసెంబర్ 19: సాయంత్రం 5:00: ముగింపు వేడుక
ముఖ్య అతిథి: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

బిరుదురాజు రామరాజు ప్రాంగణం (తెలుగు విశ్వవిద్యాలయ ఆడిటోరియం)సామల సదాశివ వేదిక
డిసెంబర్ 16: ఉదయం 10:00 గం. తెలంగాణ పద్య కవితా సౌరభం (సదస్సు)
మధ్యాహ్నం 3:00. తెలంగాణ వచన కవితా వికాసం (సదస్సు)
డిసెంబర్ 17: ఉదయం 10:00 గం. కథా సదస్సు
మధ్యాహ్నం 3:00గం. తెలంగాణ నవలా సాహిత్యం
సాయంత్రం. 6:00 గం. కథా,నవలా, రచయితల గోష్ఠి
తేదీ డిసెంబరు 18: ఉదయం 10:00గం – తెలంగాణ విమర్శ – పరిశోధన
మధ్యాహ్నం 3:00 గం. – శతక, సంకీర్తనా, గేయ సాహిత్యం
సాయంత్రం. 6:00 గం. -కవి సమ్మేళనం
డిసెంబరు 19: ఉదయం 10:00 గం. – తెలంగాణలో తెలుగు – భాషా సదస్సు

గుమ్మన్నగారి లక్ష్మీ నరసింహశర్మ ప్రాంగణం (రవీంద్ర భారతి సమావేశ మందిరం )డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి వేదిక
ఉదయం 10:00 గం. అష్టావధానం
మధ్యాహ్నం 12:30 గం. హాస్యావధానం
మధ్యాహ్నం 3:00 గం. పద్యకవి సమ్మేళనం
డిసెంబర్ 17: ఉదయం 10:00 గం. జంట కవుల అష్టావధానం
మధ్యాహ్నం 12:30 గం. అక్షర గణితావధానం
మధ్యాహ్నం 3:00 గం. అష్టావధానం
సాయంత్రం 5:30 గం. నేత్రావధానం
సాయంత్రం 6:00 గం. శ్రీప్రతాపరుద్ర విజయం (రూపకం)
డిసెంబర్ 18 : ఉదయం 10:00 గం. పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో తెలుగు
మధ్యాహ్నం 3:00 గం. న్యాయ వ్యవహారాలు, ప్రభుత్వపాలనలో తెలుగు
డిసెంబర్ 19: ఉదయం 10:00 గం. తెలంగాణ చరిత్ర (సదస్సు)

అలిశెట్టి ప్రభాకర్ ప్రాంగణం (ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, పబ్లిక్‌గార్డెన్)వానమామలై వేదిక
డిసెంబర్ 16: ఉదయం 10:00 గం. నుంచి డిసెంబరు 19వ సాయంత్రం 4:00 గం. వరకు – బృహత్ కవి సమ్మేళనం (ఏడు వందలమంది కవులతో కవి సమ్మేళనం)
డాక్టర్ యశోధారెడ్డి ప్రాంగణం ( రవీంద్రభారతి)
బండారు అచ్చమాంబ వేదిక
డిసెంబర్ 16 : ఉదయం 10:00 గం. బాల సాహిత్య సదస్సు
మధ్యాహ్నం 4:00 గం. హరికథ (లోహిత)
మధ్యాహ్నం 4:30 గం. నృత్యం (వైష్ణవి)
మధ్యాహ్నం 4:45 గం. సంగీతం (రమాశర్వాణి)
డిసెంబర్ 17 : ఉదయం 10:00 గం. బాలకవి సమ్మేళనం
మధ్యాహ్నం 3:00 గం. తెలంగాణ వైతాళికులు (రూపకం)
డిసెంబర్ 18 : ఉదయం 10:00 గం. తెలంగాణ మహిళా సాహిత్యం (సదస్సు)
మధ్యాహ్నం 3:00 గం. కవయిత్రుల సమ్మేళనం
డిసెంబర్ 19 : ఉదయం 10:00 గం. ప్రవాస తెలుగువారి భాషా సాంస్కృతిక విద్యా విషయాలు (విదేశీ తెలుగువారితో గోష్ఠి)
మధ్యాహ్నం 2:00 గం. ప్రవాస తెలుగువారి భాషా సాంస్కృతిక విద్యా విషయాలు (రాష్ర్టేతర తెలుగువారితో గోష్ఠి)

మరింగంటి సింగరాచార్యుల ప్రాంగణం(తెలంగాణ సారస్వత పరిషత్తు సభా భవనం)శతావధాని కోరుట్ల కృష్ణమాచార్య వేదిక
డిసెంబర్ 16 నుంచి 19 వరకు ప్రతిరోజు ఉదయం 10:00 గం. నుంచి రాత్రి 7:00 గం. వరకు శతావధానం
పైడి జయరాజు ప్రివ్యూ థియేటర్ (రవీంద్రభారతి)
డిసెంబర్ 16 నుంచి 19 వరకు ప్రతిరోజు ఉదయం 11:00 గం. నుంచి రాత్రి 9:00 గం. వరకు యువ చిత్రోత్సవం
ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీ (రవీంద్రభారతి)
డిసెంబర్ 16 నుంచి 19 వరకు కార్టూన్ ప్రదర్శన
రవీంద్రభారతి ప్రాంగణం
డిసెంబర్ 16 నుంచి 19 వరకు ఛాయాచిత్ర ప్రదర్శన
చిత్రమయి ఆర్ట్‌గ్యాలరీ, మాదాపూర్
డిసెంబర్ 16 నుంచి 19 వరకు ఛాయాచిత్ర ప్రదర్శన

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/prapancha-telugu-maha-sabha-celebrations-1-2-561951.html