భళా.. ఒగ్గుడోలు కళ - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

భళా.. ఒగ్గుడోలు కళ

ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని జనగామ జిల్లా కేంద్రంలో మూడురోజులపాటు నిర్వహించనున్న సన్నాహక సమావేశాలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన, డీసీపీ మల్లారెడ్డి ఆర్టీసీ ప్రధాన చౌరస్తాలో గాలిలోకి బెలూన్లు వదిలి సన్నాహక కార్యక్రమాలు ప్రారంభించారు. డప్పుడోలు, ఒగ్గుడోలు కళాకారుల నృత్యాలు, విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఆర్టీసీ చౌరస్తా నుంచి నెహ్రూపార్కు వరకు కళాకారుల ఆట, పాట, పోతరాజులు, ఒగ్గుడోలు కళాకారుల విన్యాసాలతో ప్రదర్శన కొనసాగింది. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శనను కలెక్టర్ ప్రారంభించారు. ఆర్డీవో వెంకట్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఈశ్వరయ్య సహా పలువురు జిల్లా అధికారులు పంచెకట్టు వస్ర్తాలు ధరించారు. మరోవైపు సిద్దిపేట రోడ్డులోని బృందావన్ గార్డెన్‌లో నెల్లుట్ల రవీందర్‌రావు ఆధ్వర్యంలో జరిగిన సాహితీ సదస్సులో కలెక్టర్ శ్రీదేవసేనతోపాటు ప్రధాన వక్తగా ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ఉపకులపతి బసవ చెన్నప్ప, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏడవెల్లి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలన్నారు.
OgguKala

Source: https://www.ntnews.com/Prapancha-Telugu-Mahasabhalu-2017/oggu-dolu-kala-1-2-561864.html