తెలుగు ప్రజలకిది గొప్ప పండుగ : సిద్ధారెడ్డి - Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తెలుగు ప్రజలకిది గొప్ప పండుగ : సిద్ధారెడ్డి

nandinitelugu
ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించుకోవడం తెలుగు ప్రజలకు గొప్ప పండుగ అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి పేర్కొన్నారు. తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో సిద్ధారెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. తెలుగు మహాసభలు రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలిచాయన్నారు. ఈ ఐదు రోజుల పాటు నిర్విరామంగా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తకావిష్కరణలు, అవధానాలు జరిగాయి. ఈ మహాసభలకు 42 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభలు వర్ధిల్లాలని సిద్ధారెడ్డి చెప్పారు. తెలుగు మహాసభల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించాయని ఆయన తెలిపారు.

Source: https://www.ntnews.com/World-Telugu-Conference-2017/nandini-sidhareddy-speaks-at-telugu-mahasabhalu-1-1-551613.html