ముగింపు నాడు తీర్మానాల ప్రకటన - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

ముగింపు నాడు తీర్మానాల ప్రకటన

మహాసభల సందర్భంగా వచ్చిన వివిధ సూచనలను క్రోడీకరించి చివరి రోజు ఈ నెల 19న తీర్మానాలు చేస్తామని, వాటిని ఎల్‌బీ స్టేడియంలోని ప్రధాన వేదిక నుంచి ప్రకటిస్తామని తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ నందిని సిధారెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి తెలిపారు. సాహిత్య అకాడమీ కార్యాలయంలో ‘తెలంగాణ వైభవం- పరిచయ దీపిక’ పుస్తకం, ‘ఓలీ ఓలీల రంగ ఓలి’ అనే జానపద గీతాల సీడీని ఆవిష్కరించిన తర్వాత వారు మాట్లాడారు. ‘మహాసభల ఏర్పాట్లు శుక్రవారంఉదయానికి పూర్తవుతాయి. ఇప్పటికే ఆహ్వానితులు చాలా మంది హైదరాబాద్‌ చేరుకున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సాయంత్రం 5గంటలకు నగరానికి వస్తారు. 5.30 గంటలకు మహాసభలు ప్రారంభమవుతాయి. వివిధ పోటీల్లో రాష్ట్రస్థాయిలో విజేతలైన విద్యార్థులకు మహాసభల ప్రధాన వేదికపైనే బహుమతులు అందజేస్తాం.ప్రధాన వేదిక వద్దకు చేరడానికి ఎనిమిది ద్వారాలు ఏర్పాటు చేశాం. అత్యంత ముఖ్యులు (వీవీఐపీ), ముఖ్యులు (వీఐపీ), ప్రతినిధులకు, ఆహ్వానితులకు ఒక్కో ద్వారం ఉంటుంది. సాధారణ ప్రజలు రెండు ద్వారాల నుంచి గ్యాలరీలోకి వెళ్లొచ్చు. గ్యాలరీల్లో 20 నుంచి 25 వేల మంది వరకు కూర్చోవచ్చు. అక్కడ 15, 20 ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేస్తున్నాం. జ్ఞానపీఠ్‌ పురస్కారగ్రహీతలు ముగ్గురు హాజరవుతున్నారు. ప్రారంభం నాడు ప్రధాన వేదికపై వారిని సన్మానిస్తాం. హోటళ్లలో దిగినవారికి ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం హోటళ్లలోనే ఉంటుంది’ అని చెప్పారు.

Source: http://www.eenadu.net/news/news.aspx?item=ts-state-news&no=9