మాతృభాషను వారసత్వంగా అందించాలి - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

మాతృభాషను వారసత్వంగా అందించాలి

PadmaDevenderreddy
ప్రపంచ తెలుగు మహాసభలను స్పూర్తిగా తీసుకొని మహిళలు మాతృభాషను వారసత్వంగా తమ పిల్లలకు అందించి తెలుగుభాషను పరిరక్షించేందుకు ముందుకు రావాలని శాసనసభ ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రవీంద్రభారతిలో డాక్టర్ యశోదారెడ్డి ప్రాంగణం.. బండారు అచ్చమాంబ వేదికపై సోమవారం తెలుగు కవయిత్రుల సమ్మేళనం ఆద్యంతం రసవత్తరంగా సాగింది. ముఖ్యఅతిథిగా హాజరైన పద్మాదేవేందర్‌రెడ్డి కవయిత్రులను, రచయిత్రులను ఘనంగా సత్కరించారు. మట్టిలో మాణిక్యాల్లాంటి కవులను, సాహితీవేత్తలను, కళాకారులను వెలికితీసి వెలుగులోకి తీసుకువచ్చి సరైన గౌరవం కలిగించే ప్రయత్నమే ప్రపంచ తెలుగు మహాసభలని ఆమె పేర్కొన్నారు. తెలుగుభాష గొప్పదనం మన పండుగలు, సంస్కృతి, సంప్రదాయాలలో గోచరిస్తుందని

ప్రముఖ రచయిత్రి అనిశెట్టి రజిత అధ్యక్షతన జరిగిన సదస్సులో ప్రఖ్యాత కవయిత్రులు ఓల్గా, ఎస్ కరుణ, పాలడుగు మేరీ మాదిగ, గిరిజ, జయంతి, వసుధ, ఆకుల సుష్మ తదితరులు కవితలను గానం చేసి ఆహూతుల కరతాళధ్వనులందుకున్నారు. అనంతరం ప్రముఖ సాహితీవేత్త జ్వలిత అధ్యక్షతన జరిగిన సమ్మేళనంలో డాక్టర్ వరలక్ష్మి, మాఢభూషి సునీత, శాంతాదేవి, రాజేశ్వరి, వేముల శ్రీదేవి, జీవనరాధ తమదైన శైలిలో కవితలను గానం చేసి సాహితీప్రియులను అలరించారు. తెలుగు మహాసభలలో ఒకరోజు మహిళా కవయిత్రులకు కేటాయించడం శుభపరిణామమని అంటూ పలువురు మహిళా సాహితీవేత్తలు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ కమీషన్ చైర్మన్ బీఎస్ రాములు తదితరులు పాల్గొని పలు కవితల సంపుటాలను ఆవిష్కరించారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/mother-tongue-is-a-legacy-1-2-562449.html