రాష్ట్ర వైభవం తలపించేలా తెలుగు మహాసభలు - World Telugu Conference 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

రాష్ట్ర వైభవం తలపించేలా తెలుగు మహాసభలు

harish-raoతెలంగాణ వైభవం, భాష గొప్పతనాన్ని, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నామని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. తెలుగు మహాసభలో సిద్దిపేట కీర్తిని చాటేలా.. సిద్దిపేట కవులు, కళాకారులు అగ్రభాగాన నిలువాలని పిలుపునిచ్చారు.శుక్రవారం సిద్దిపేటలో శివానుభవ మండపంలో ప్రపంచ తెలుగుమహాసభల సన్నాహక సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ సాహిత్యంలో సిద్దిపేటకు కీలకస్థానం ఉన్నదని, తెలుగు మహాసభలకు సన్నాహాకంగా సిద్దిపేటలో 15 రోజుల పాటు సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు పండుగ వాతావరణలో జరుగాలని సూచించారు. తర్వాత బైరి అంజయ్య గార్డెన్‌లో జిల్లాస్థాయి ప్రధానోపాధ్యాయుల సదస్సు, వందశాతం వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల నిర్మాణాలపై సమీక్షించారు. 70 రోజుల్లోగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలంలో మొక్కల సంరక్షణ బాగుందని మంత్రి అభినందించారు. పదోతరగతి పరీక్షలో వందశాతం ఫలితాలు సాధించడం సిద్దిపేట నుంచే ప్రారంభం కావాలని ఆదేశించారు. సమావేశాల్లో శాసనమండలి చీఫ్‌విప్ సుధాకర్‌రెడ్డి, విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, యాదగిరిరెడ్డి, సతీశ్‌కుమార్, కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి పాల్గొన్నారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/minister-harish-rao-unveils-worlds-telugu-mahasabhalu-poster-1-2-561051.html