తెలుగు మహాసభల్లో ఎన్నారైలు పాల్గొనండి - World Telugu Conference 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తెలుగు మహాసభల్లో ఎన్నారైలు పాల్గొనండి

Mahesh bigala participated in Telugu mahasabhalu
తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభలలో ఎన్నారైలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆస్ట్రియా సన్నాహక సదస్సులో ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల పిలుపునిచ్చారు. తెలుగు మహాసభలకు ప్రవాస తెలుగు సాహితీవేత్తలను, కవులను, మరియు సంగీత, నృత్య, జానపద కళాకారులకు అవగహన కలిపించి ఆహ్వానం పలికారు. ఆస్ట్రియా దేశంలోని వియన్నాలో నిర్వహించిన తెలుగు మహాసభల సన్నాహక సదస్సులో మహేష్ బిగాల ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచమంతా పర్యటిస్తూ ఈ మహాసభలకు తెలుగు వారిని, సాహితీ ప్రియులను, తెలుగు భాషాభిమానులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన చెప్పారు. తెలుగు భాష గొప్పతనం మరియు దాని చరిత్ర తెలుసుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఇది అన్నారు. మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో చాల గొప్పగా నిర్వహించబోతున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు మహాసభలు తొలిసారి నిర్వహిస్తున్నందున సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివేక్ రెడ్డి ,సతీష్ , రాజు, శ్రీకాంత్, వంశితో పాటు తదితరులు పాల్గొన్నారు.

Source: https://www.ntnews.com/telangana-news/mahesh-bigala-participated-in-telugu-mahasabhala-meeting-1-1-549347.html