ప్రపంచ తెలుగు మహాసభల లోగో ఆవిష్కరణ..
రవీంద్రభారతిలో ప్రపంచ తెలుగు మహా సభలు కార్యాలయాన్ని ఎంపీ కవిత ప్రారంభించారు. అనంతరం ప్రపంచ తెలుగు మహాసభల లోగోను ఎంపీ కవిత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిధారెడ్డితోపాటు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 15 నుంచి 19వ తేదీ వరకు ప్రపంచ తెలుగు మహాసభలు జరుగనున్న విషయం తెలిసిందే.
Source: https://www.ntnews.com/telangana-news/world-telugu-conference-logo-launched-today-1-1-546951.html