తెలుగు మహాసభలకు కాళోజీ ‘నా గొడవ’ - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తెలుగు మహాసభలకు కాళోజీ ‘నా గొడవ’

kaloji-naa-godavaహైదరాబాద్ ఎల్బీస్టేడియంలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రజాకవి కాళోజీ ఇంటి నుంచి ఆయన 1953లో వెలువరించిన నా గొడవ పుస్తకాన్ని తీసుకొని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ బయలుదేరారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి తెలంగాణ వైతాళికుల జ్ఞాపకాలను ఈ సభలకు తీసుకొని రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపును అందుకొని ఎమ్మెల్యే గురువారం సాయంత్రం కాళోజీ ఇంటికి వెళ్లి కాళోజీ ఫౌండేషన్ సభ్యులు కాళోజీ రవికుమార్, డాక్టర్ అంపశయ్య నవీన్, వీఆర్ విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాసరావు, పందిళ్ల అశోక్‌కుమార్, కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య బన్నా అయిలయ్యల చేతుల మీదుగా నా గొడవ తొలిప్రతిని స్వీకరించారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్ వొద్దిరాజు గణేష్, కవి, రచయిత రావిచెట్టు రాజేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/kalojis-my-confrontation-to-telugu-confederations-1-2-562132.html