ప్రపంచ తెలుగు మహాసభలకు ఉపరాష్ట్రపతికి ఆహ్వానం - Telugu Conference 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

ప్రపంచ తెలుగు మహాసభలకు ఉపరాష్ట్రపతికి ఆహ్వానం

హైదరాబాద్‌లో డిసెంబర్‌ 15 నుంచి 19 వరకు జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలమేరకు దిల్లీలోని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి ఆదివారం ఉపరాష్ట్రపతిని కలిసి తెలుగు మహాసభల్లో పాల్గొనాలని ఆహ్వానించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు అదేరోజు నుంచి ప్రారంభమవుతున్నందున వీలుచూసుకొని తప్పకుండా హాజరవుతానని వెంకయ్యనాయుడు హామీ ఇచ్చినట్లు వేణుగోపాలాచారి చెప్పారు.

Source: http://www.eenadu.net/news/news.aspx?item=state-news&no=17