ఆహ్వానితులెవరు ? - World Telugu Conference 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

ఆహ్వానితులెవరు ?

invities
ఈ ఏడాది డిసెంబర్‌ 15 నుంచి 19 దాకా హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక ఏర్పాట్లపై రవీంధ్రభారతిలోని కళాభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. సమావేశంలో పలు కీలక అంశాలపై కోర్‌ కమిటీ చర్చించింది. మహా సభలకు ఇతర దేశాలు, రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ముఖ్యులతో పాటు ఇతర దేశాధినేతలు, రాష్ట్రాల ప్రముఖులను ఆహ్వానించడంపై, వారికి చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ముఖాముఖి చర్చలు, వేదికలపై నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రచురించాల్సిన ప్రచురణలు, సాహిత్య ప్రక్రియలపైనా చర్చ జరిగింది. ఈ సమావేశానికి ప్రపంచ తెలుగు మహాసభల కోర్‌ కమిటీ సభ్యుల ప్రత్యేక ఆహ్వానం మేరకు నిజామాబాద్‌ ఎంపీ కవిత హాజరయ్యారు. మహాసభల ప్రచారం కోసం హైదరాబాద్‌, జిల్లా కేంద్రాల్లో తెలుగు సాహిత్యం, కవితలు, పద్యాలను హోర్డింగ్‌ల ద్వారా ప్రదర్శించాలని, విమానాలు, రైళ్లు, బస్సుల్లో ప్రపంచ తెలుగు మహాసభల లోగోను స్టిక్కరింగ్‌ చేయాలని కోర్‌కమిటీ నిర్ణయించింది. పత్రికలు, ఎలకా్ట్రనిక్‌ మీడియా ద్వారా ప్రచారానికి ఆయా పత్రికల, చానెళ్ల సంపాదకులు, యాజమాన్యాలతో భేటీ కావాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని ప్రాచీన శాసనాలు, చారిత్రక వారసత్వ కట్టడాల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సంకల్పించింది. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, పర్యాటక, సాంస్కృతిక శాఖల కార్యదర్శి బుర్ర వెంకటేశం, సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఎస్‌వీ సత్యనారాయణ, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ అధ్యక్షుడు అయాచితం శ్రీధర్‌, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.

Source: http://www.andhrajyothy.com/artical?SID=476371