మహాసభలకు ఉపాధ్యాయులను ఆహ్వానించండి - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

మహాసభలకు ఉపాధ్యాయులను ఆహ్వానించండి

Default post image

ప్రపంచ తెలుగు మహాసభలకు రాష్ట్రంలోని 31 జిల్లాల నుంచి ఉపాధ్యాయులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్పీసింగ్ ఆదేశించారు. మహాసభల ఏర్పాట్లపై సోమవారం విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఉపాధ్యాయులందరికీ ఉచిత బస్సుసౌకర్యం, భోజ న సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేకప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు కిషన్ పాల్గొన్నారు.
తెలుగుమహాసభలను విజయవంతం చేయండి
మహాసభలకు ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పీఆర్‌టీయూటీఎస్ నేత సరోత్తంరెడ్డి, చెన్నకేశవరెడ్డి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/invite-teachers-to-the-telugumahasabalu-conference-1-2-561854.html