తెలుగు భాషకు ప్రాణం పోస్తున్న ప్రభుత్వం -World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తెలుగు భాషకు ప్రాణం పోస్తున్న ప్రభుత్వం

ANISHETTY-RAJITHA

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించ డం ఎంతో ఆనందం గా ఉందని ప్రముఖ రచయిత్రి అనిశెట్టి రజిత అన్నారు. ప్రజాకవి కాళోజీ నుంచి ధిక్కార వారసత్వాన్ని అందిపుచ్చుకున్న అనిశెట్టి రజిత 1969-71లో జైతెలంగాణ ఉద్యమం చివరిదశలో తన పదకొండవ ఏట పాల్గొన్నారు. 45 ఏండ్లుగా రచయిత్రిగా, సంపాదకురాలుగా, సామాజిక కార్యకర్తగా నిరంతరం కృషి చేస్తున్నారు. ఇటీవల అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సాహిత్యంలో విశిష్ట మహిళా పురస్కారంతో ఆమెను సన్మానించింది. ప్రపంచ తెలుగు మహాసభల సాహిత్య విభాగంలో మహిళా కమిటీలో ఆమె సభ్యురాలుగా ఉన్న రజిత నమస్తే తెలంగాణ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు భాష పరిరక్షణకు ప్రభుత్వం చేస్తున్న కృషి, సాహితీవేత్తలు, పండితులు, భాష, సంస్కృతుల పునర్నిర్మాణంలో భాగస్వామ్యం తీరుపై తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

తెలుగు భాషకు పూర్వవైభవం వస్తుందంటారా?

భాష జీవనదిలాంటిది. తెలంగాణ భాషపై గతంలో ముప్పేటదాడి జరిగింది. కానీ ఇప్పుడు మహర్దశ పొందుతున్నది. అందుకే, భాష నశిస్తే జాతి జీవనం, సంస్కృతి నశిస్తుంది. తెలుగు భాష పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేస్తున్న కృషి అమోఘం.. అభినందనీయం.ఇంటర్ వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం.

ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై మీ అభిప్రాయం?
గతంలో తెలుగు మహాసభలు తెలంగాణవాళ్లకు అందని ద్రాక్షలా ఉండిపోయాయి. ఏ కొందరో మహానుభావులకు తప్ప అవి అందుబాటులో లేవు. కానీ ఇప్పుడు తెలంగాణ కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, పండితులు, భాషాభిమానులకు తెలంగాణ ప్రభుత్వం అగ్రతాంబూలం ఇస్తున్నది. తెలంగాణ భాష, సాహిత్యానికి పూర్వవైభవం వస్తున్నది. పోతున్న ప్రాణం లేచివచ్చినట్టయింది.

తెలంగాణ భాషకు విముక్తి లభించిందనుకుంటున్నారా?

సుమారు 60 ఏండ్ల క్రితం తొలితరం మహిళా రచయిత్రి పాకాల యశోదరెడ్డి మనభాష పరిరక్షణకు ఉద్యమం చేశా రు. ఇప్పుడు మళ్లీ తెలంగాణ ప్రభుత్వం మన భాషకు ప్రా ణం పోస్తున్నది. మనభాష ఔన్నత్యాన్ని కాపాడుతున్నది. భవిష్యత్‌లో పరిశోధనలు అన్నీ తెలుగులోనే జరుగాలి.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/happy-to-organize-telugu-conferences-says-anisetti-rajitha-1-2-561984.html