తెలుగు మహాసభలకు భారీగా విదేశీ ప్రతినిధులు
వచ్చే నెల 15 నుంచి 19 వరకు హైదరాబాద్లో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు విదేశాల నుంచి పెద్దఎత్తున ప్రతినిధులు హాజరవుతారని ప్రవాస తెలంగాణ సంఘాల నేతలు తెలిపారు. సభల నిర్వహణలో తామూ భాగస్వాములవుతామన్నారు. లండన్లో గురువారం ప్రవాస తెలంగాణ సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహాక సదస్సు జరిగింది. ప్రవాస సంఘాల నేత బిగాల మహేశ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెరాస బ్రిటన్, తెలంగాణ జాగృతి యూకే శాఖ, టాక్, టీడీఎఫ్, టీఎన్ఎఫ్, తాల్, యుక్తా, జెటీఆర్టీసీ ప్రతినిధులు, రచయితలు, కళాకారులు, మేధావులు పాల్గొన్నారు. పవిత్రారెడ్డి దీనికి సమన్వయకర్తగా వ్యవహరించారు. మహేశ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మహాసభలకు తెలంగాణ ప్రవాసులు పెద్దఎత్తున హాజరు కావాలన్నారు.
Source: http://www.eenadu.net/news/news.aspx?item=state-news&no=21