తెలుగు మహాసభలకు ముస్తాబు - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తెలుగు మహాసభలకు ముస్తాబు

Default post image

ప్రపంచ తెలుగు మహాసభలకు నగరం ముస్తాబవుతోంది. మహాసభలను గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అందుకు తగ్గట్టుగా గ్రేటర్ హైదరాబాద్‌లో ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ప్రపంచ తెలుగు మహాసభలకు నగరం మొత్తం ప్రత్యేక విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు. నగరంలోని ఎల్‌బీస్టేడియం, ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, సెక్రెటరియేట్ ప్రాంతాలు ప్రత్యేక వెలుగులతో ఆకర్షణీయంగా దర్శనం ఇవ్వనున్నాయి. వీటితో పాటు గ్రేటర్ పరిధిలోని ముఖ్య జంక్షన్లు, ప్రధాన రహదారులపై నగరవాసులతో పాటు సభలకు విచ్చేసే అతిధులకు ఆశ్చర్యాన్ని కలిగించనున్నాయి. ఇప్పటికే ఎల్‌ఇడి వెలుగులతో నిండిపోయిన భాగ్యనగరం మరింత అందంగా కనిపించనుంది. మహాసభల విద్యుత్ అలంకరణకు జీహెచ్‌ఎంసి సుమారు రెండు కోట్లను ఖర్చు చేయనుంది.

Source: http://www.andhrabhoomi.net/content/hyd-3605