గవర్నర్‌ను తెలుగుమహాసభలకు ఆహ్వానించిన సీఎం కేసీఆర్

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

గవర్నర్‌ను తెలుగుమహాసభలకు ఆహ్వానించిన సీఎం కేసీఆర్

CM-KCR
గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో కలిసి ప్రపంచ తెలుగు మహాసభలకు విశిష్ట అతిథిగా హాజరుకావాలని ఆహ్వానించారు. ఎంపీ కే కేశవరావుతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం కేసీఆర్ దాదాపు మూడున్నర గంటలకుపైగా గవర్నర్‌తో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. హైదరాబాద్ వేదికగా జరుగనున్న తెలుగు మహాసభల ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ గవర్నర్‌కు వివరించారు. ఈ మహాసభలకు ప్రపంచంలోని తెలుగు కవులు, కళాకారులను ఆహ్వానించినట్టు గవర్నర్‌కు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ నెల 15 ప్రారంభ సమావేశానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సభల ముగింపు రోజు ఈనెల 19 సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ పాల్గొంటున్నందున చేస్తున్న ఏర్పాట్లను వివరించినట్టు తెలిసింది.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/cm-kcr-to-invite-governor-to-world-telugu-conference-1-2-561975.html