తెలుగుకు ఆదరణను పెంచిన సీఎం కేసీఆర్ - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తెలుగుకు ఆదరణను పెంచిన సీఎం కేసీఆర్

తెలుగు భాషకు సీఎం కేసీఆర్ ఆదరణను పెంచుతున్నారని రాష్ట్ర విద్యుత్, ఎస్సీసంక్షేమశాఖల మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల జిల్లాస్థాయి సన్నాహాల ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. అమ్మలాంటి కమ్మనైన తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం దృఢ సంకల్పంతో కృషి చేస్తున్నదని చెప్పారు. ఇంటర్ వరకు తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీచేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పూల రవీందర్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, జాతీయ ఉత్తమ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, జేసీ రవినాయక్ పాల్గొన్నారు. <SuddhalaAshokTeja

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/cm-kcr-given-the-popularity-to-telugu-language-1-2-561873.html