మహాసభల్లో శాస్త్రీయ నృత్యాలకు ప్రాధాన్యం -Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

మహాసభల్లో శాస్త్రీయ నృత్యాలకు ప్రాధాన్యం

Default post image

ప్రపంచ తెలుగు మహాసభల్లో శాస్త్రీయ నృత్యాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని సాంస్కృతిక సారథి చైర్మన్ రమసయి బాలకిషన్ పేర్కొన్నారు. రవీంద్రభారతిలోని ఆరుబయట ప్రాంగణంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సీమ్‌లెస్ షో సంస్థ నృత్యోత్సవం-2017 పేరుతో కార్యక్రమం నిర్వహించింది. తెలంగాణ కళల వైభవాన్ని విదేశాల్లో చాటి వచ్చిన 30 మంది కళాకారుల బృందాన్ని సన్మానించింది. ఈ కార్యక్రమానికి రసమయి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కళాకారులు యూరప్ దేశాల్లో పర్యటించి శాస్త్రీయ నృత్యప్రదర్శనలు ఇచ్చి విదేశీయుల ప్రశంసలు అందుకోవడంతోపాటు శాస్త్రీయ నృత్య వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని అభినందించారు. నాట్యగురువు వనజా ఉదయ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/classical-dances-are-preferred-in-the-councils-1-2-561759.html