తెలుగు మహాసభల్లో నేడు సినీ సంగీత విభావరి - Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తెలుగు మహాసభల్లో నేడు సినీ సంగీత విభావరి

Default post image

హాజరుకానున్న అగ్రశ్రేణి సంగీత దర్శకులు, నటీనటులు
ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా సోమవారం సినీసంగీత విభావరి నిర్వహించనున్నారు. ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 6 గంటల నుంచి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో ఈ విభావరి జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని తెలుగు సినిమా సంగీత దర్శకుల సంఘం సహకారంతో ఏర్పాటు చేశారు. సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్, ఆర్పీ పట్నాయక్, శ్రీలేఖ, కల్యాణీమాలిక్, సాయికార్తీక్, రాధాకృష్ణన్ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తారు. గబ్బర్‌సింగ్ దర్శకుడు హరీశ్‌శంకర్, బృందావనం దర్శకుడు వంశీ పైడిపల్లి, మాటల రచయితలు పరుచూరి బ్రదర్స్, నిర్మాత దిల్‌రాజు, సినీనటులు అక్కినేని నాగార్జున, పోసాని కృష్ణమురళి, మా అధ్యక్షుడు శివాజీరాజా, జయసుధ తదితర సినీ ప్రముఖులు పాల్గొంటారు. గతకొన్ని రోజులుగా ఈ విభావరి కోసం ప్రత్యేకంగా సాధన చేశారు.

Source: https://www.ntnews.com/telangana-news/cini-sangeetha-vibhavari-in-telugu-mahasabhalu-1-1-551422.html