ప్రతిభ కలిగిన యువతకు కొదువలేదు - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

ప్రతిభ కలిగిన యువతకు కొదువలేదు

TalasaniSrinivasYadav

సమాజానికి సందేశాన్ని అందించే లఘుచిత్రాలకు ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుందని రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభలలో భాగంగా రవీంద్రభారతి ప్రాంగణంలోని పైడిజయరాజ్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన యువచిత్రోత్సవం-2017 లఘుచిత్రాల పోటీల్లో సోమవారం మంత్రి ఉత్తమచిత్రాలను ప్రకటించి, అవార్డులను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణలో ప్రతిభ కలిగిన యువతకు కొదువలేదని, గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలు, అభివృద్ధి, మార్పును సృజనాత్మకతో ఆలోచిస్తే ప్రతి అంశమూ ఒక లఘు చిత్రమవుతుందన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలు ఉగాది పండుగను తలపించేంత గొప్పగా జరుగుతున్నాయని తలసాని తెలిపారు. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ యువ లఘుచిత్రోత్సవంలో 173 చిత్రాలు ప్రదర్శనకు వచ్చాయని చెప్పారు.

యువ దర్శకుడు పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన, కే అంజమ్మ నిర్మాణ సారథ్యంలోని అనాదిగా చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. డాక్టర్ జీ కుమారస్వామి దర్శకత్వం వహించిన నేను బ్రతికే ఉంటానుకు రెండు, వీరస్వామి దర్శకత్వంలో, మంగా భాస్కర్ నిర్మించిన గావురం మూడవ ఉత్తమచిత్రాలుగా ఎంపికయ్యాయి. మొదటి ఉత్తమ చిత్రానికి రూ.50వేలు, రెండో చిత్రానికి రూ.40వేలు, మూడవ చిత్రానికి 30 వేలు నగదు బహుమతిగా అందజేశారు. కన్సోలేషన్ బహుమతులు పొందిన తంగేడు పూలు, అద్దె ఇల్లు, నది లఘుచిత్రాలకు రూ. 25వేల చొప్పున అందజేశారు. మైనా లఘు చిత్రానికి స్పెషల్ స్క్రీనింగ్ బహుమతి లభించింది. కార్యక్రమంలో డాక్టర్ విజయ్‌కుమార్, జ్యూరీ సభ్యులు ప్రేమ్‌రాజ్, రామ్మోహన్, వేణు, ఉత్తేజ్ తదితరులు పాల్గొన్నారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/awards-to-the-best-documentaries-1-2-562456.html