400 మంది హరిత వలంటీర్లు - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

400 మంది హరిత వలంటీర్లు

400-members-volinteers
ప్రపంచ తెలుగు మహాసభల్లో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), నేషనల్ గ్రీన్ కార్ఫ్స్ (ఎన్‌జీసీ) భాగస్వామవుతున్నాయి. మహాసభల కోసం ఎన్‌జీసీకి చెందిన 400 మంది వలంటీర్లు శ్రమించబోతున్నారు. వీరిలో 200 మంది అమ్మాయిలు కాగా, మరో 200 మంది అబ్బాయిలు. వీరంతా హైదరాబాద్ నగరానికి చెందిన వారే కావడం గమనార్హం. నగరంలోని పలు కళాశాలలు, పాఠశాలలకు చెందిన వీరిని మహాసభల కోసం ఎంపిచేశారు. వీరంతా ఆకుపచ్చ, తెలుపురంగుల్లో గల చీర, అంగి, ప్యాంట్లు, పర్యావరణ కోట్‌లతో కూడిన దుస్తులను ధరించి మహాసభల్లో పాల్గొననున్నారు. దుస్తుల తయారీకయ్యే వ్యయాన్ని పీసీబీ భరించనున్నది. వీరంతా విమానాశ్రయం, విడిది గృహాల నుంచి ప్రతినిధులను మహాసభల ప్రాంగణం వద్దకు తోడ్కోని రావడం, తిరిగి మహాసభల ప్రాంగణం నుంచి విడిది గృహాల వద్దకు తీసుకెళ్లడంలో సాయమందించనున్నారు. వయస్సు పైబడినవారికి వీరు చేదోడువాదోడుగా నిలువడంతోపాటు మహాసభలను విజయవంతం చేయడంలో పాలుపంచుకోనున్నారు. ఇప్పటికే వలంటీర్ల ఎంపిక పూర్తయిందని, ఒక రోజు శిక్షణ ఇచ్చి వీరిని సన్నద్ధం చేయబోతున్నామని పీసీబీ సోషల్ సైంటిస్ట్ వీరన్న, ఎన్‌జీసీ కోఆర్డినేటర్ రాధిక సోమవారం నమస్తే తెలంగాణకు తెలిపారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/400people-haritha-volunteers-1-2-561855.html