తెలుగు భాషా వికాసాలకు పుట్టినిల్లు తెలంగాణ. తెలంగాణ అంటే తెలుగు ప్రజలు నివసించే ప్రదేశం అని అర్థం. రెండున్నరవేల వసంతాల తెలుగు వెన్నల సోన మన తెలంగాణ. అలనాటి హాలుని గాథా సప్తశతిలో అల్లనల్లన అల్లుకున్న తెలుగు పదదీప్తి కాలగమనంలో దశ దిశల ప్రసరించింది. ఈ పదరూపాలు చారిత్రిక జీవనాన్ని అక్షరబద్ధం చేసిన శాసనాలైనాయి. అందమైన అలంకారాలు ధరించి హృద్యమైన పద్య కావ్యాలైనాయి. తెలంగాణ అన్ని సాహిత్య ప్రక్రియలకు ఆదిగా నిలిచింది. తొలి అలంకార గ్రంథాన్ని సంతరించింది. ఎలుగెత్తి పాడుకునే ద్విపదనందించింది. తెలుగు స్వతంత్ర కావ్యం, శతకం, ద్విపద రామాయణం, అచ్చ తెలుగు కావ్యం, యక్ష గానం, సాంఘిక చరిత్రం అన్నిటికీ తొలిరూపు దిద్దింది. ఆధునిక ప్రక్రియలైన వచనకవిత, కథ, నవల అన్నిటిలో తనదైన జీవనాన్ని చిత్రించింది. కొలమానాలకందని సాహిత్య సంపదతో కొలువుదీరింది. తెలుగు సాంస్కృతిక వికాసంలో తెలంగాణ జాతి ఖ్యాతిని ప్రపంచానికి విదితం చేయాలనే సంకల్పంతో ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమి నిర్వహణలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నది.
మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఐదు రోజుల పాటు రాజధానిలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలు యావత్ తెలంగాణ సమాజంలో మాతృభాషాభిమానం పెల్లుబికేలా చేశాయి. మహత్తరంగా సాగిన ఈ మహాసభల్లో పాల్గొనేందుకు 31 జిల్లాల…
ప్రపంచంలోనే తెలుగు భాష గొప్పదని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కొనియాడారు. దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు అని ఆయన తెలిపారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని కోవింద్ పేర్కొన్నారు.…
ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించుకోవడం తెలుగు ప్రజలకు గొప్ప పండుగ అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి పేర్కొన్నారు. తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో సిద్ధారెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. తెలుగు మహాసభలు…
ప్రపంచ తెలుగు మహాసభల వేదికలు ఎల్. బి. స్టేడియం, రవీంద్ర భారతి, లలిత కళా తోరణం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం మరియు ఎన్.టి.ఆర్. ఆడిటోరియం.